Fraud In AP: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని జనాలను మోసం చేస్తోన్న రామ్ గోపాల్.. మంత్రుల పేరు వాడుకుంటూ మరీ..
Fraud In The Name Of Ministers PA: ప్రజల ఆశ, అవసరాన్ని ఆసరగా తీసుకుంటూ సమాజంలో జరుగుతోన్న మోసాలు నిత్యం చూస్తునే ఉన్నా. తాజాగా ఇలాంటి ఓ మోసమే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో...
Fraud In The Name Of Ministers PA: ప్రజల ఆశ, అవసరాన్ని ఆసరగా తీసుకుంటూ సమాజంలో జరుగుతోన్న మోసాలు నిత్యం చూస్తునే ఉన్నా. తాజాగా ఇలాంటి ఓ మోసమే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చింది. విశాఖకు చెందిన రాంగోపాల్ అనే వ్యక్తి ప్రజలకు ఆశ చూపుతూ భారీ ఎత్తున డబ్బులు వసూళు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. మంత్రుల పీఏ అంటూ పరిచయం చేసుకుంటున్న రామ్ గోపాల్ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ ప్రజల నుంచి డబ్బులు వసూళు చేస్తున్నాడు. అంతటితో ఆగకుండా నిరుద్యోగులను టార్గెట్ చేసుకున్న సదరు కీలాడి ప్రభుత్వ ఉద్యోగాలను ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. దీంతో ఈ విషయం తెలసుకున్న పోలీసులు పీడీయాక్ట్ కేసు నమోదు చేశారు. రామ్ గోపాల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసుకు సంబంధించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
కృష్ణపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు.. వైద్య ఆరోగ్యశాఖ రాపిడ్ టెస్టుల్లో బయట పడిన వైనం.!