AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HOROSCOPE TODAY : దైవ ప్రార్థనల వల్ల మంచి ఆలోచనలు.. అత్యవసర పనులకు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి..

RASI PHALALU- 2021 ON MAY 30 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ

HOROSCOPE TODAY : దైవ ప్రార్థనల వల్ల మంచి ఆలోచనలు.. అత్యవసర పనులకు మాత్రమే డబ్బు ఖర్చు చేయండి..
Horoscope Today
uppula Raju
|

Updated on: May 30, 2021 | 5:18 AM

Share

RASI PHALALU- 2021 ON MAY 30 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు ఆదివారం (మే 30న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

వృషభ రాశి : యోగ, మెడిటేషన్ లేక ఏదైనా ఆట ఆరోగ్యపరంగా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. దైవ ప్రార్థనల వలన మంచి ఆలోచనలు వస్తాయి. ఇంటి కొనుగోలుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. డబ్బును అత్యవసర ఖర్చులకు మాత్రమే పెట్టండి. పొదుపు చేయండి. మీ పిల్లలతో గడపటం మీకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది.

మేష రాశి : వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తుల గురించి శుభవార్త అందుతుంది. ఇతరులను విమర్శించడం ఆరోగ్యానికి హానికరం. కుటుంబ వ్యవహారాలలో గొడవలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అందరి మెప్పు పొందుతారు. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు.

మిధున రాశి : సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం మీకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. కొంతమందికి ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఆశాజనకం. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థికపరమైన ఇబ్బంది లేదు మీ అవసరాలకు తగిన ఖర్చు చేస్తారు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. కొత్త పెట్టుబడులకు కావలసిన డబ్బు సమకూరుతుంది.

కర్కాటక రాశి : సంఘంలో పేరుప్రతిష్టలు వస్తాయి. గుడులను సందర్శిస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు శ్రమను కలిగిస్తాయి ఓర్పుతో పనులు పూర్తి చేయండి. ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకున్నా ఖర్చులు మీ చేయి దాటి పోతున్నాయి. ఆధ్యాత్మికత విషయంలో గురువు లేక ఇంటిలోని పెద్ద వారు మీకు తగిన సలహాలు ఇస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి.

కన్యారాశి : కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం మీకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. ఫిట్ నెస్ కొరకు యోగ, మెడిటేషన్ చేయండి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీ పిల్లల ప్రగతి మీకెంతో గర్వ కారణం అవుతుంది. అద్భుతమైన భవిష్యత్తు కొరకు సరైన ప్రణాళికలు వేసుకొండి. ఆదాయం బాగుండడం వలన ఖర్చులు ఇబ్బంది పెట్టక పోవచ్చు.

సింహరాశి : కొన్ని మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు చేస్తారు. ఇష్టం లేకున్నా ప్రయాణం చేయవలసి రావచ్చు. ఫిట్ నెస్ కొరకు యోగా మెడిటేషన్ చేయండి. కొంతమందికి కాలు నొప్పి బాధించవచ్చు. ఆస్తి తగాదాల లో పరిష్కార సూచనలు. వ్యాపారస్తులకు లాభాలను తెచ్చి పెట్టే రోజు. మీ ఖర్చులను బేరీజు వేసుకోండి.

తులారాశి : నూతన గృహ నిర్మాణం లేక కొనుగోలుకు సంబంధించి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఆదాయ వ్యవహారాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగి అందరూ ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన విషయం మీకు అనుకూలం.

వృశ్చిక రాశి : దీర్ఘకాలిక పెట్టుబడులు వలన అధిక లాభాలు. బాధ్యతలు పెరుగుతాయి. మీ సహనాన్ని అలుసుగా తీసుకునే వారికి సరైన సమాధానం ఇవ్వండి. కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కావలసినంత సమయం గడపలేక పోవటం మీకు అశాంతి నిస్తుంది. తక్కువ నిద్ర వలన శారీరక అలసట. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.

ధనుస్సు రాశి : అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. భూముల కొనుగోలు గురించి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆరోగ్యం పూర్తిగా చక్కబడుతుంది. నచ్చిన దేవుడి పాటలను వినటం వలన మానసిక ప్రశాంతత. మీ శత్రువుల మీద విజయం సాధించడం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. డబ్బు పెట్టుబడులను వాయిదా వేయండి.

మకర రాశి : నెగెటివ్ థాట్స్ మీకు అనారోగ్యం తెచ్చి పెట్టకముందే వాటిని వదిలేయండి. దానం చేయటం వలన మరియు ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ దృక్పథంలో మార్పు వస్తుంది. ఒకే రకమైన పనుల కన్నా మార్పులను ప్రయత్నించండి. ఉద్యోగ పరంగా ప్రయాణాలు ఉండవచ్చు. ఎంతో కాలం నుంచి మాట్లాడదామని అనుకుంటున్న స్నేహితునితో మాట్లాడతారు.

కుంభరాశి : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయాన్ని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు నిరుద్యోగులు ఇంకొంచెం శ్రద్ధ పెడితే మీరు అనుకున్న గోల్ సాధిస్తారు. కొన్ని మార్పులు మిమ్మల్ని ఉద్వేగానికి గురి చేస్తాయి. డబ్బు సంపాదన లో ఆరి తేరతారు. స్థిరాస్తి వ్యవహారాలలో మీ సొంత నిర్ణయం మాత్రమే తీసుకోండి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

మీన రాశి : ఆర్థిక విషయాలు ఇబ్బంది పట్టక పోవచ్చు కానీ డబ్బును అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆఫీసులో పని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు కలిగే అవకాశం. ఒక శుభవార్త ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.