HOROSCOPE TODAY : స్థిరాస్థి వ్యవహారాలను వాయిదా వేయండి.. ఇంటిలో పెద్దల సలహా తీసుకోండి.
RASI PHALALU- 2021 ON MAY 29 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ
RASI PHALALU- 2021 ON MAY 29 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు శనివారం (మే 29న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి : ఈ కరోనా సమయంలో అనవసర భయాందోళనలను వదిలివేయండి. మీ భయము అనారోగ్యానికి దారి తీయవచ్చు. మానవసేవే మాధవసేవ. దాన ధర్మాలు సహాయము చేయండి. ఇంటిలో పెద్దల సలహా తీసుకోండి. ఆఫీసులో చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ప్రయాణాలు లాభిస్తాయి. స్థిరాస్థి వ్యవహారాలను వాయిదా వేయండి.
వృషభ రాశి : ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది. ఆఫీసులో అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయండి లేకుంటే పై అధికారుల నుంచి మాటలు. ఈరోజు ఏవైనా ముఖ్యమైన పనులను ఆలోచించి చేయండి లేకుంటే వాయిదా వేయండి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కాలం వృధా చేయవద్దు.
కర్కాటక రాశి : బయటి భోజనం కన్నా ఇంటి భోజనము ఆరోగ్య కరము. జీతము పెంచమనే మీ కోరిక ఎటు తేలదు. భవిష్యత్తులో డబ్బు అవసరాల కోసం ఈ రోజు నుంచే వీలైనంత పొదుపు చేయండి. కుటుంబ సభ్యులతో సహనంతో వ్యవహరించండి మర్యాదపూర్వకంగా మాట్లాడండి. సామాజిక కార్యక్రమాలలో ఇతరులకు చేసిన సహాయం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
మిధున రాశి : మీ కోరికలను తీర్చుకోవడానికి మొండి వాదన చేస్తారు. ఈ విషయము కుటుంబ సభ్యుల మధ్య చర్చకు దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంది. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదన కొరకు సరైన చోట పెట్టుబడులు పెట్టండి. ఆఫీసును మీ పని సామర్థ్యాన్ని అందరూ పొగుడుతారు.
సింహరాశి : ఫిట్ నెస్ కొరకు యోగ మెడిటేషన్ చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగ, వ్యాపార విషయాలలో మీ తండ్రిగారి సలహాలు పాటించండి. మీ మనసును బాధ పెట్టిన వారితో వాదోపవాదాలకు దిగకండి. ఈ సమస్య మరింత పెద్దదవుతుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపటం వలన కుటుంబ బంధం గట్టిపడుతుంది.
కన్యారాశి : అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు దైవసహాయం మీకుంది. అత్యాశతో డబ్బు లాభం కోసం దొంగ స్కీముల జోలికి పోకండి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యంగా ఉండకండి. తెలియని వారితో వాదోపవాదాలు దిగకండి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి : విద్యార్థులకు వారి శక్తిసామర్థ్యాల మేరకు విజయఅవకాశాలు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఆచితూచి వ్యవహరించండి. ఇంటిలో పెద్దవారికి అనారోగ్య సూచనలు. జాగ్రత్తగా ఉండండి. ఫిట్ నెస్ కొరకు నిజాయితీగా పాటుపడండి. ఆరోగ్యం పూర్తిగా అదుపులో ఉంటుంది. ఆఫీసులో పనులన్నీ సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు.
తులారాశి : మీ డబ్బు పెట్టుబడుల విషయాలు పొదుపు విషయాలు పదిమందికి చెప్పకండి. ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్త పడకపోతే అనారోగ్య సూచనలు. ఈ ఆనందకరమైన రోజు లో అనవసరమైన ఆందోళనను వదిలివేయండి. ఒక శుభవార్త కుటుంబంలో ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులు మనసు లగ్నం చేసి చదవండి విజయం మీదే.
ధనుస్సు రాశి : ఈరోజు ముఖ్యమైన పనులు చేయబోయే ముందు పెద్ద వారి ఆశీర్వచనాలు తీసుకోండి. పాత స్నేహితులతో చిన్ననాటి జ్ఞాపకాలు ఆనందం ఇస్తాయి. రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి అమ్మకాలలో కావలసిన రేటు లభించదు.
మకర రాశి : ఆర్థిక విషయాలలో చేతికి కావాల్సినంత ధనం అందుతుంది. దుబార, వృధా ఖర్చులను నియంత్రించండి. అలాగే అతి తిండి కూడా మీ శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడదని గ్రహించండి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. వ్యాపారంలో భాగస్వాములకు మీ నిర్ణయమును గట్టిగా చెప్పండి. ఈ రాశి స్త్రీలకు మీ ఆత్మీయులతో సమస్యలను విప్పి చెప్పండి పరిష్కారం పొందండి.
కుంభరాశి : మీకు అప్పగించబడిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బిల్డర్స్ మరియు కాంట్రాక్టర్లకు అనుకోని మంచి అవకాశాలు. ఆరోగ్యం కోసం మంచి చిట్కాలను పాటించండి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడటానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. మీ నెగటివ్ ధోరణి మీ వారిని నిరుత్సాహ పరుస్తుంది. మీరు మారాలి తప్పదు.
మీన రాశి : నిరాశవాద ధోరణిని పూర్తిగా పక్కకి నెట్టేయండి. ఆ రోజులు అయిపోయినాయి. సామాజిక కార్యక్రమాలలో మీకు ప్రశంసలు లభిస్తాయి. నిరుద్యోగులకు వారి ఊహలకు తగిన ఉద్యోగం కొరకు అధిక శ్రమ పడవలసి వస్తుంది. ఆర్థిక పరమైన విషయాలు పూర్తిగా మెరుగుపడతాయి. బయట భోజనం కన్నా ఇంటిలోని భోజనం మిన్న మరియు ఆరోగ్యకరం.