HOROSCOPE TODAY : విధులను ఉత్సాహంగా నిర్విర్తిస్తారు.. ఆకస్మిక ధన లాభం.. ఆర్థిక పరిస్థితిలో మార్పు..
RASI PHALALU- 2021 ON MAY 28 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ
RASI PHALALU- 2021 ON MAY 28 : మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు శుక్రవారం (మే 28న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి : అతిధుల రాక ఆనందం ఇస్తుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగంలో కొత్త విధులు ఉత్సాహంగా నిర్వర్తిస్తారు. ధన లాభం ఉంది. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలను మొదలుపెడతారు.
వృషభ రాశి : ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ పరిచినా క్రమేపీ మెరుగుపడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పంటి నొప్పి వచ్చే అవకాశం. కావలసిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తెస్తాయి.
మిధున రాశి : ఓపిక, సహనం ఇవి మాత్రమే మీకు మంచి చేస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు విసుగు తెప్పిస్తాయి. కారణాలు చెప్పి తప్పించుకోవటం కన్నా పని ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేసి పై అధికారుల మెప్పు పొందండి. ఖర్చు అవసరాలు చాలా ఉన్నాయి ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టండి. మీ నోటి దురుసు తనం ఇంటిలోని పెద్దవారిని ఇబ్బంది పెట్టవచ్చు.
కర్కాటక రాశి : చాలా అనుకూలమైన రోజు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోండి. మీ పిల్లల పురోగతి మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. చెప్పదలుచుకున్నది అందరికీ అర్థం అయ్యేట్టు చెప్తారు.
సింహరాశి : కుటుంబంలోని వ్యక్తులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. సభలు సమావేశాలలో పాల్గొనటానికి ఆహ్వానం అందుతుంది. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి. స్థిరాస్తుల వ్యవహారాలలో సరైన తీసుకుంటారు. ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్యారాశి : మీ తోడబుట్టిన వారి వ్యవహారాల వలన కొన్ని సమస్యలు రావచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు లేవు అయినప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. అధిక శ్రమ వలన మెడనొప్పి బాధించవచ్చు. కుటుంబ వ్యవహారాలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తీసుకొస్తాయి.
తులారాశి : ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. తోడబుట్టిన వారి నుంచి కావలసిన సహాయం అందుతుంది. నగలు మరియు ఖరీదైన ఇంటి సామాను కొనే అవకాశం. ఉద్యోగంలో మీ ప్లాన్ లను సరిగా అమలు పరచండి. అందరి ప్రశంసలు పొందుతారు. Spicy ఫుడ్ తీసుకోకండి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం.
ధనస్సు రాశి : వ్యాపారంలో మీ ఆత్మీయుల సలహాలను పాటించండి లాభాలు పొందుతారు. అనుకున్న పనులను సకాలంలో అతిశీఘ్రంగా పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులను ప్రణాళిక ప్రకారం పెట్టండి లాభాలు వస్తాయి. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాల వలన ఆరోగ్యం అదుపులో ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
వృశ్చిక రాశి : రావలసిన పాత బకాయిలు వసూలవుతాయి. ఖాళీగా ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చే అవకాశం. అనుకున్న పనులు పూర్తి కావాలంటే దైవ సహాయం కొరకు ప్రార్థించండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. కుటుంబంలోని ఒక వ్యక్తి గొంతెమ్మ కోరికలు కోరడం వలన మీకు మనశ్శాంతి కరువు.
మకర రాశి : మీరు ఉత్సాహంగా ఉంటూ ఎదుటివారిని సంతోషంగా ఉంచుతారు. మీ చేతికి అందిన వన్నీ మీవే. ఉద్యోగంలో అతి శ్రమ వలన నిరాశ. పై అధికారులను మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి.
కుంభరాశి : స్థిరాస్థి వ్యవహారాలలో మీకు అనుకూలం. అనేక విధాలుగా పెట్టిన పెట్టుబడుల నుంచి మీకు ధన లాభం. ఉద్యోగంలో అధిక శ్రమ. సరైన ప్రణాళిక వేసుకొని ఆఫీసులో పనులు పూర్తి చేయండి. నిరాశ వాదము, విచారం రెండు వదిలివేయండి. ఫిట్ నెస్ కోసం చేస్తున్న ప్రయత్నాల వలన ఆరోగ్యం అదుపులో ఉంటుంది.
మీన రాశి : యోగా మరియు మెడిటేషన్ మీకు అవసరం. దాని వలన మానసికంగా మరియు శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు అనుకున్న ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేస్తారు. భూమి కొనుగోలుకు సంబంధించి శుభవార్త అందుతుంది. కుటుంబం లోని వ్యక్తులతో ఆనందంగా గడుపుతారు. బాంధవ్యాల విలువ తెలుసుకుంటారు.