Narasimha Temple: వృక్ష రూపంలో కొలువైన నరసింహస్వామి దివ్యక్షేత్రం ఎక్కడ ఉందో తెలుసా..!
Koppara Narasimha Temple: దేవుడు ఇందు గలడని అందు లేడని సందేహం వలదు.. ఎందెందు వెతికిన అందుగలడు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణకై..ధర్మ పరిరక్షణకై శ్రీ మహావిష్ణువు రక రకాల అవతారాలు ఎత్తి మానవాళిని. సమస్త భూ మండలాన్ని కాపాడుతూ ఉన్నారని హిందువుల నమ్మకం. అటువంటి విష్ణువు అవతారల్లో ఒకటి నరసింహ అవతారం.
తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించుకోవడానికి హిరణ్యకశ్యపుడిని శిక్షించడానికి విష్ణుడు ఎత్తిన అవతారం నరసింహుడు.ఈ నరసింహ అవతారం ఎంతో విశిష్టత ను సంపాదించుకుంది. అయితే ఈ నరసింహ స్వామి వృక్ష రూపం లో కొలువైన భక్తుల పాలిట కొంగుబంగారంగా పిలవబడుతూ పూజలను అందుకుంటున్నాడు. ఆ దివ్య క్షేత్రం 5వ శతాబ్దానికి చెందినదిగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.
1 / 5
అందమైన కృష్ణ తీరాన వెలసిన దేదీప్యమానమైన నరసింహ క్షేత్రం.రాయచూరు నుంచి 65 కి మీ దూరం లో మన్వి అనే చిన్న నగరానికి 10 కి మీ దూరం లో ఉన్న కోప్పరా అనే గ్రామంలో నరసింహ స్వామి వృక్ష రూపంలో పూజలను అందుకుంటున్నారు.
2 / 5
స్థల పురాణం ప్రకారం ఇక్కడ కార్పర ఋషి ఘోర తపస్సు ఫలితంగా నర్సింహ స్వామి ఒక వృక్షము లో అశ్వత రూపం లో దర్శనమిచ్చారని తెలుస్తోంది. ఈ క్షేత్రం.. కార్పర నరసింహ క్షేత్రం గా..కాలక్రమంలో అది కోప్పరాగా మారింది అని తెలుస్తుంది.
3 / 5
ప్రక్కనే ఉన్న కృష్ణమ్మ తల్లి ఒడి లో స్నామాచరించి స్వామి వారిని దర్శించుకుంటే సకల కష్టాలు,రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం...కోరిన కోరికలు నెరవేర్చే తండ్రి నరసింహుడు. నరసింహ జయంతి కి విశేషామైన పూజ కార్యక్రమాలు నిర్వహించ బడుతాయి..
4 / 5
కృష్ణ నది ఒడ్డున కొలువైన ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు జీవిత కాలం లో ఒక సారి అయిన చూడాలని.. దేవదేవుని అనుగ్రహం పొందాల్సిందేనని స్వామివారిని దర్శించుకున్న భక్తులు చెబుతుంటారు.