Bedroom Vastu Tips: ఈ వాస్తు దోషాలు మీకు నిద్ర లేకుండా చేస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

Bedroom Vastu Tips: ఈ వాస్తు దోషాలు మీకు నిద్ర లేకుండా చేస్తాయి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

Bedroom Vastu Tips: విపరీతంగా పని చేసి, లేదా ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాక హాయిగా నిద్రపోవాలని భావిస్తుంటారు.

Shiva Prajapati

|

Jan 19, 2022 | 9:48 PM

Bedroom Vastu Tips: విపరీతంగా పని చేసి, లేదా ప్రయాణం చేసి అలసిపోయి వచ్చాక హాయిగా నిద్రపోవాలని భావిస్తుంటారు. శరీరం బాగా అలసిపోతే ఆటోమాటిక్‌గా నిద్ర వస్తుంది. అయితే, కొందరికి మాత్రం బెడ్ మీద పడుకోగానే నిద్ర రాదు. అర్థరాత్రి వరకు కూడా మెసులుతుంటారు. ఒకవేళ నిద్రపోయినా మళ్లీ మళ్లీ నిద్రలేస్తుంటారు. మరికొంతమంది అయితే, పడుకున్న తరువాత మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నట్లయితే, అలాంటి సమస్యకు వాస్తు దోషాలే ప్రధాన కారణం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీ పడకగదిలోని వాస్తు దోషాలే మీకు నిద్ర లేకుండా చేస్తాయని చెబుతున్నారు. మరి ఆ వాస్తు దోషాలేంటి? వాస్తు దోష నివారణ చర్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రశాంతంగా నిద్ర పొందడానికి పడకగది మాత్రమే కాదు, మంచం కూడా సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యం. లేదంటే ఎవరైనా సరే సరిగా నిద్రపోలేరు. వాస్తు దోషాల కారణంగా శారీరక, మానసిక, వైవాహిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితం మొత్తం అస్తవ్యవస్థం అవుతుంది. 2. వాస్తు ప్రకారం.. పడకగదిలో బెడ్ ఎప్పడు నైరుతి దిశలో ఉండాలి. మీ మంచం తలగడ కూడా ఎప్పుడూ దక్షిణ దిశలో ఉండాలి. అలాగే, పడకగదికి ఈశాన్యం వైపు ఖాళీగా ఉండాలి. 3. దుమ్ము, దూళి ఉన్న మంచం మీద ఎప్పుడూ పడుకోకూడదు. దుమ్ము, దూళి ఉన్న బెడ్ మీ ప్రశాంత నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాదు.. రాత్రిపూట పీడకలలు వచ్చే అవకాశం కూడా ఉంది. 4. నిద్రపోయే ముందు మీ చేతులు, కాళ్లు, ముఖం కడుక్కోవాలి. శుభ్రమైన మంచం మీద పడుకోవడం వలన రాత్రి పీడకలలు రావు. ప్రశాంతమైన నిద్ర పోందవచ్చు. 5. బూట్లు, చెప్పులు, చీపుర్లు, డస్ట్‌బిన్‌లు, మరేదైనా పాడైపోయిన వస్తువులను మంచం పక్కన మర్చిపోయి కూడా ఉంచొద్దు. ఇవి మీ మంచం చుట్టూ ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాయి. ఇది మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తుంది. 6. రాత్రిపూట నిద్రపోయిన తరువాత షాక్‌కు గురవుతున్నట్లు అనిపించినా, రాత్రి సమయంలో పీడకలలు వచ్చినా.. మీ దిండు కింద లేదా మంచం కింద కత్తి లేదా ఏదైనా ఇనుప వస్తువును ఉంచాలి. 7. ప్రశాంతమైన నిద్ర పొందాలనుకుంటే.. బెడ్‌రూమ్‌లో మంచం దగ్గర టీవీ, ఫ్రిజ్, ఫోన్ వంటి వాటిని అస్సలు ఉంచొద్దు. ఇవి మీ నిద్రకు భంగం కలిగిస్తాయి. వాటి నుంచి వెలువడే ప్రతికూల శక్తి మీ ఆరోగ్యానికి కూడా హానీ చేస్తాయి. వాస్తు ప్రకారం.. మీ పడకగదిలో టీవీ ఉంటే రాత్రి పడుకునే ముందు దానిపై కర్టెన్ వేయాలి. లేదంటే మీ మంచం ప్రతిబింబం దానిలో కనిపిస్తుంది. వాస్తు ప్రకారం ఇది అశుభంగా పరిగణించబడుతుంది. 8. వాస్తు ప్రకారం.. పడకగదిలో మరచిపోయి కూడా మీ బెడ్‌ను దూలం కింద ఉంచకూడదు. దీని వల్ల మీ నిద్రకు భంగం వాటిల్లుతుంది. అంతేకాదు.. ఈ వాస్తు దోషం వల్ల మీ వైవాహిక జీవితంపైనా చెడు ప్రభావం చూపుతుంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాల ఆధారంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.

Also read:

Gas Geyser: ఇంట్లో గ్యాస్ గీజర్ వాడుతున్నారా.. ఇవి తప్పక తెలుసుకోండి.. లేకుంటే ప్రమాదంలో పడే ఛాన్స్..

U19 World Cup 2022: భారత జట్టులో కరోనా కలకలం.. కెప్టెన్‌తో సహా ఆరుగురికి పాజిటివ్..!

వైవాహిక అత్యాచారంపై ఢిల్లీ హైకోర్టులో పిటీషన్లు.. సమాజంపై ప్రభావం చూపుతుందంటున్న నిపుణులు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu