AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miracle in Andhra Pradesh: కొబ్బరికాయలో అమ్మవారు.. కళ్లు తెరిచి చూసింది..!

Miracle in Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో అద్భుత సంఘటన జరిగింది. దేవుడికి కొట్టిన కొబ్బరి కాయలో అమ్మవారి..

Miracle in Andhra Pradesh: కొబ్బరికాయలో అమ్మవారు.. కళ్లు తెరిచి చూసింది..!
Shiva Prajapati
|

Updated on: Jan 19, 2022 | 6:46 PM

Share

Miracle in Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లాలో అద్భుత సంఘటన జరిగింది. దేవుడికి కొట్టిన కొబ్బరి కాయలో అమ్మవారి రూపం సాక్షాత్కరించింది. కొబ్బరికాయలో అమ్మవారి కళ్ల మాదిరి రెండు ఆకారాలు భక్తులను ఆకర్షించాయి. స్థానికులంతా దీన్ని ఆసక్తిగా చూస్తూ పూజలు చేస్తున్నారు.

వివరాల్లోకెళితే.. జిల్లాలోని వెల్లా మూర్తి స్థానిక షుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. అయితే, మూర్తి.. డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తుండగా, ఓ కొబ్బరికాయ దొరికింది. ఆ కాయను స్థానికంగా కొలువైన సత్తెమ్మ తల్లి కి నైవేద్యంగా పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 18న మూర్తి భార్య నాగ శ్రీవాణి, కుమారుడు శ్రీనివాసులు ఆ కొబ్బరికాయ కొట్టారు. ఆ కాయలో రెండు నేత్రాలు పెద్దగా కనిపించడంతో భయంతో వెంటనే వారు కింద పడేశారు. ఈ విషయం భర్తకు చెప్పింది నాగశ్రీవాణి. అది గమనించిన మూర్తి.. ఇదంతా అమ్మవారి మహిమగా భావించారు. కొబ్బరి ముక్కలు లోపలకు తెచ్చి పూజలు చేయడం ప్రారంభించారు.

ఈలోగా స్థానికంగా ఉన్న ఓ మహిళకు మావుళ్ళమ్మ పూని మీ ఇంటి ఆవరణలో జమ్మి చెట్టు కింద నేను ఉన్నాను.. నాకు గుడి కట్టించండి అని తెలిపింది. ఈ విషయం ఆ నోటా ఆ నోటా పాకడంతో తండోపతండాలుగా జనం తరలి వచ్చి ఈ వింతను చూసి వెళ్తున్నారు. కొబ్బరికాయ లో ఉన్న కళ్ళను అమ్మవారి దైవం అంటూ పసుపు కుంకుమతో పూజలు చేస్తున్నారు.

Also read:

MLA Dharma Sri: ఎమ్మెల్యే ధర్మశ్రీని ప్రజాదర్బార్‌లో నిలబెట్టిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video: యూట్యూబ్ వీడియోలు చూసి విమానం తయారు చేసిన జంట.. ఫిదా అవుతోన్న నెటిజన్లు..!

A S I video: టికెట్ లేని ప్రయాణికుడిని కాలితో తన్నిన పోలీసు..! వైరల్ అవుతున్న వీడియో..