AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Dharma Sri: ఎమ్మెల్యే ధర్మశ్రీని ప్రజాదర్బార్‌లో నిలబెట్టిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తనకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారంటూ.. ఎమ్మెల్యే ధర్మశ్రీనే ప్రజాదర్బార్‌లో నిలబెట్టిందో మహిళ.

MLA Dharma Sri: ఎమ్మెల్యే ధర్మశ్రీని ప్రజాదర్బార్‌లో నిలబెట్టిన మహిళ.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Prajadarbar
Balaraju Goud
|

Updated on: Jan 19, 2022 | 6:42 PM

Share

MLA Dharma Sri in Prajadabar: తనకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారంటూ.. ఎమ్మెల్యే ధర్మశ్రీనే ప్రజాదర్బార్‌లో నిలబెట్టిందో మహిళ. ఆ వివాదమేంటీ.. ఎమ్మెల్యేకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు.. ప్రజలకు సేవ చేయాలి. ఏదైనా సమస్యతో ఎవరైనా వస్తే న్యాయం వైపు నిలబడాలి. కానీ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. మాత్రం అన్యాయం వైపు నిలబడి తనకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని ఓ బాధితురాలు న్యాయ పోరాటానికి దిగింది. అంతే కాదు ప్రజాదర్బార్‌లో నిలబెట్టి వివరణ ఇచ్చేలా చేసింది.

ఎప్పటిలాగే.. ఎంపీ విజయసాయిరెడ్డి.. తన ఆఫీసులో ప్రజాదర్భార్ నిర్వహించారు. చాలా మంది తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారించుకుని వెళ్లే వాళ్లు. కానీ అనకాపల్లికి చెందిన దేవి అనే మహిళ మాత్రం చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీపై కంప్లైంట్ చేసింది. తమ స్థలానికి పాస్ బుక్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీపై దేవి అనే మహిళ ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేశారు.

విజయసాయిరెడ్డి ప్రజా దర్బార్ లో పలువురు నేతలపై ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా చోడవరం ఎమ్మెల్యేపై ఫిర్యాదు రావడంతో ఎమ్మెల్యేను కూడా ప్రజాదర్బార్‌కు పిలిపించారు. ఎంపీ కార్యాలయంలో జరుగుతోన్న ప్రజాదర్బార్‌కి నేరుగా వచ్చిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. పాస్ బుక్ ఇవ్వకుండా తానేమీ అడ్డుకోలేదనీ.. అసలు ఆ విషయం తన దృష్టిలోనే లేదన్నారు ధర్మశ్రీ. కుటుంబ వివాదాలను రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు ధర్మశ్రీ.

ఎమ్మెల్యే మాటలు ఇలా ఉంటే.. బాధితురాలు దేవి ఆరోపణలు మరోలా ఉన్నాయి. ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. మరోసారి ఇలా ల్యాండ్ డీలింగ్‌ విషయంలో ప్రజాదర్బార్ ఎక్కాల్సి వచ్చింది.

Read Also….  AP CS Sameer sharma: పీఆర్సీ, ఉద్యోగుల ఆందోళనపై ఏపీ సీఎస్ సమీర్ శర్మ కీలక వ్యాఖ్యలు!