bala hanuman mandir: హనుమాన్ ఆలయంలో 1964 నుంచి నిరంతరం రామనామ జపం.. గిన్ని బుక్ రికార్డ్.. ఆలయం ఎక్కడంటే
ఓ హనుమాన్ ఆలయంలో భక్తులు నిరంతరం రామ నామ చేస్తూ ఏకంగా రికార్డ్ సృష్టించారు. కొన్ని దశాబ్దాలుగా రామ నామ జపం చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న బాల హనుమాన్ ఆలయాన్ని శ్రీ ప్రేమ్ భిక్షుజీ మహారాజ్ స్థాపించారు. 1964 నుంచి రామ నామ జపం పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరం జపం చేయడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేశారు. ఈ ప్రత్యేకమైన జపం, ఆలయ మతపరమైన ప్రాముఖ్యత కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు దర్శనం కోసం ఇక్కడికి వస్తారు.

భారత దేశం దేవాలయాల దేశంగా ఖ్యాతిగాంచింది. దేశంలో శ్రీరాముని పరమ భక్తుడైన హనుమంతుని ఆలయాలు చాలా ఉన్నాయి. ఈ ఆలయాల వైభవం అపారమైనది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న బాల హనుమాన్ ఆలయం భజరంగబలి ఆలయాలలో ఒకటి. ప్రతి సంవత్సరం హనుమంతుని దర్శనం చేసుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తారు. ఈ హనుమాన్ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. బాల హనుమాన్ ఆలయం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చబడింది. ఈ ఆలయం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎందుకు చేర్చబడిందంటే
బాల హనుమాన్ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు?
గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న ఈ బాల హనుమాన్ ఆలయం 1963-64 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ బాల హనుమాన్ ఆలయాన్ని శ్రీ ప్రేమ్ భిక్షుజీ మహారాజ్ నిర్మించారు. ఈ ఆలయంలోని బాల బజరంగబలి దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఒక కారణం ఉంది. 1964 నుంచి రామ నామ జపం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ ఆలయం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చబడింది.
బాల హనుమాన్ ఆలయం స్థాపించబడిన తర్వాత.. ఆలయంలో రామ నామ జపం ప్రారంభమైంది. ఆలయంలో రామ నామ జపం ఆగస్టు 1వ తేదీ, 1964 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ఆలయంలో ఉదయం, సాయంత్రం, పగలు , రాత్రి రామ నామాన్ని జపిస్తూనే ఉన్నారు. ఈ బాల హనుమాన్ ఆలయంలో రాముడి నామ జపం ఎప్పుడూ ఆగలేదు. 1964 నుంచి ఆలయంలో రాముని నామ జపం జరుగుతుండటం వలన దీని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చబడింది. ప్రపంచంలో ఇంత కాలంగా నిరంతరం నామ జపం జరుగుతున్న ప్రదేశం మరెక్కడా లేదు. రాముని నామాన్ని నిరంతరం జపించడం వల్ల ఈ ఆలయ వాతావరణం ఎంతో సానుకూలంగా ఉంటుందని.. శక్తితో నిండి ఉంటుందని నమ్మకం.
ఆలయంలో దర్శన సమయాలు
బాల హనుమాన్ ఆలయంలో భక్తులు ఎప్పుడైనా బజరంగబలి దర్శనం చేసుకోవచ్చు. అయితే మంగళ వారం మాత్రం దర్శనం కోసం ఉదయం వేళల్లో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుంటారు. తరువాత సాయంత్రం 6.30 గంటలకు భక్తులు శృంగార దర్శనం చేసుకోవచ్చు. ఆలయంలో మంగళ ఆరతి ఏడు గంటలకు ఇస్తారు. దీని తరువాత భక్తులు మధ్యాహ్నం 12 గంటలకు భోగ దర్శనం చేసుకోవచ్చు. సాయంత్రం ఏడు గంటలకు ఆలయంలో సాయంత్రం ఆరతి నిర్వహిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








