AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: తమిళనాడు, కేరళలో ప్రముఖ క్షేత్రాలను తక్కువ ధరకే చుట్టేయండి.. తెలంగాణ, ఏపీలో హాల్ట్ స్టేషన్స్ ఇవే..

ప్రముఖ పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ఇష్టమా.. అది కూడా తక్కువ ధరలోనే సౌకర్యవంతంగా ఆలయాలను, ప్రకృతి అందాలను వీక్షిచడం ఇష్టమైన వారి కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. తెలుగువారు ఈ టూర్ ప్యాకేజీ ద్వారా తమిళనాడు, కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఈ దివ్య దక్షిణ యాత్రలో భాగంగా జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్రవేశపెట్టింది. మొత్తం తొమ్మిది రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీ గురించి తెలుసుకుందాం..

IRCTC Tour: తమిళనాడు, కేరళలో ప్రముఖ క్షేత్రాలను తక్కువ ధరకే చుట్టేయండి.. తెలంగాణ, ఏపీలో హాల్ట్ స్టేషన్స్ ఇవే..
Dakshin Yatra With Jyotirlinga Package
Surya Kala
|

Updated on: Mar 06, 2025 | 3:08 PM

Share

ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనుకునే భక్తులకు, ప్రకృతి ప్రేమికుల కోసం ఐఆర్ సిటీసీ పలు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. చారిత్రాత్మక ప్రాంతాలను, ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. తాజాగా తెలంగాణ, ఏపీ వాసులు అరుణా చలం నుంచి కన్యాకుమారి వరకూ ప్రముఖ క్షేత్రాలను తక్కువ ధరకు వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది రైల్వే టూరిజం. ఈ నెల 21వ తేదీన సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. దివ్య దక్షిణ యాత్ర ఎనిమిది రాత్రులు.. తొమ్మిది పగళ్లు సాగనుంది. ఈ టూర్ ప్యాకేజీలో మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిల్లో స్లీపర్ క్లాస్ సీట్లు 460, థర్డ్ ఏసీ సీట్లు 206, సెకండ్ ఏసీ సీట్లు 52 అందుబాటులో ఉన్నాయి.

యాత్ర షెడ్యుల్ డీటైల్స్

భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ మార్చి 21వ తేదీన సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిర స్టేషన్స్ లోనూ

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లల్లో ఈ ట్రైన్ హాల్టింగ్ సౌకర్యం ఉంది. ఈ స్టేషన్స్లో ప్రయాణీకులు ఎక్కవచ్చు.. దివచ్చు.

ఇవి కూడా చదవండి

ఏఏ పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చంటే

ఈ ప్యాకేజీలో లో భాగంగా తమిళనాడులో ప్రసిద్ది క్షేత్రాలైన తిరువణ్ణామలై క్షేత్రం, రామేశ్వరం, మధురై లతో పాటు కేరళలోని కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచ్చి, తంజావూరు వంటి ప్రముఖ ప్రసిద్ధ ప్రాంతాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది. అగ్ని క్షేత్రమైన తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుడితో పాటు.. జ్యోతిర్లింగ క్షేత్రమైన రామేశ్వరంలోని రామేశ్వర స్వామిని మధుర మీనాక్షి అమ్మవారిని, కన్యాకుమారిలోని అమ్మన్ ఆలయంతో పాటు సూర్యోదయాన్ని, సూర్యాస్తమం చూసేందుకు బీచ్ అందాలను వివేకానంద రాక్ మెమొరియల్‌ను సందర్శించవచ్చు. తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామిని, తిరుచ్చిలో శ్రీ రంగనాథ స్వామిని, తంజావూరులో బృహదీశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఎనిమిది రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ యాత్ర తంజావూరుతో ముగుస్తుంది. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ లో తంజావూరు నుంచి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. తొమ్మిదో రోజు ఎవరి స్టేషన్ లో వారు దిగుతారు.

ప్యాకేజీ ధరలు ఎంత అంటే

ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్ లో ఒకొక్కరికి రూ 14,250 చార్జ్

5 నుంచి 11 సంవత్సరాల్లోపు పిల్లలకి రూ. 13,240 ఛార్జీ

స్టాండర్డ్ కేటగిరీలో ఒక్కరికి రూ. 21,880 చార్జ్

5 నుంచి 11 సంవత్సరాల్లోపు పిల్లలకు రూ. 20,700

కంఫర్ట్ కేటగిరీలో ఒకొక్కరికి రూ. 28,440

5 నుంచి 11 సంవత్సరాల్లోపు పిల్లలకి రూ. 27,020 లు చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ