Holi 2025: ఆర్ధిక ఇబ్బందులా.. హోలీ రోజున తులసితో ఈ నిర్వహణలు చేయండి.. ఎన్నడూ డబ్బుకి కొరత ఉండదు..
ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే హోలీ పండగ కోసం పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు. రంగుల కేళీ హోలీ పండుగను దేశ వాప్తంగా ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ రోజున తులసికి సంబంధించిన చర్యలు తీసుకోవడం వల్ల సుఖ, సంతోషాలు, సంపద పెరుగుతాయి. ఈ రోజు ఆ తులసికి సంబంధించిన నివారణల గురించి తెలుసుకుందాం..

హోలీ హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది పండగగా పరిగణించబడుతుంది. హోలీ పండుగ అంటే చాలు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. వేద క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది హోలీ 2025 మార్చి 14న జరుపుకుంటారు. దీనికి ఒక రోజు ముందు అంటే మార్చి 13న హోలికా దహనం కూడా నిర్వహిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం హోలీ రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం వలన జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నమ్ముతారు. అలాగే సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, హోలీ రోజున తులసితో ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం..
ఆర్ధిక ఇబ్బందులు తొలగడానికి
ఎవరైనా చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ.. దాని నుంచి బయటపడాలని కోరుకుంటే హోలీ రోజున తులసిని పూజించండి. పూజ సమయంలో తులసి మొగ్గలను ఎర్రటి గుడ్డలో కట్టి.. దానిని పర్సులో లేదా ఇంట్లో భద్రంగా పెట్టుకోండి. ఈ పరిష్కారాన్ని చేయడం వలన లాభాలు కలుగుతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఒక విశ్వాసం.
గ్రహ దోషాల నుంచి ఉపశమనం కోసం
హిందూ మతంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ప్రజలు తులసి మొక్కను హిందువులు తమ ఇంట్లో పెంచుకుంటారు. ఎవరైనా తమ ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలని కోరుకుంటే హోలీ రోజున ఇంట్లో తులసి మొక్కను నాటండి. తులసిని నియమాలు, ఆచారాల ప్రకారం పూజించండి. హోలీ రోజున ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని, గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం.
పెండింగ్ పనులు పూర్తి కావాలంటే
హోలీ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత లడ్డూ గోపాలుడికి అభిషేకం చేయండి. అభిషేకం సమయంలో తులసి దళాలను చేర్చండి. తరువాత లడ్డూ గోపాల్ ని అలంకరించి, రంగులు వేసి కృష్ణుడితో హోలీ ఆడండి. హోలీ రోజున ఇలా చేయడం వలన శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని.. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయని నమ్మకం.
లక్ష్మీదేవి సంతోషం కోసం
ఇంటిలో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఇందుకోసం హోలీ రోజున తులసిని పూజించి, తులసి మాతకు రంగులు అద్దండి. ఈ పరిహారం చేయడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నులవుతుందని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు








