Vastu Tips: ఈ వస్తువుల విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..! ఇంట్లో దరిద్రానికి కారణాలు ఇవే..!
ఇంట్లో శుభశక్తులు నిలిచి కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు కలగాలంటే వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. హిందూ శాస్త్రాల ప్రకారం కొన్ని వస్తువులను తెరిచి ఉంచడం వల్ల దరిద్రం పెరిగి ఆర్థిక సమస్యలు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి వస్తాయని చెబుతారు. కొంతమంది తెలియక చేసే కొన్ని చిన్న తప్పులే ఇంట్లో ప్రతికూల శక్తులను ఆకర్షించి దుష్ప్రభావాలను తీసుకురావచ్చు. ఇంట్లో కొన్ని ముఖ్యమైన వస్తువులను అనవసరంగా తెరిచి ఉంచడం వల్ల కలిగే అపాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 06, 2025 | 12:20 PM

పాలను మరిగించే ముందు 1/4 భాగాన్ని శుభ్రమైన నీటిలో కలపాలి. నీటిని జోడించడం వల్ల పాల పోషక విలువలను కాపాడుకోవచ్చు. అలాగే, స్టవ్ మీద పాలు మరిగించేటప్పుడు నిరంతరం చెంచాతో పాలను కదిలిస్తూ ఉండాలి. పాలను వేడి చేసిన తర్వాత బహిరంగ ప్రదేశంలో నిల్వ చేయకూడదు. ఫ్రిజ్‌లో ఉంచాలి. అలాగే పాశ్చరైజ్డ్ పాలను ఖచ్చితంగా మరిగించే తాగాలి. పచ్చివి ఎట్టిపరిస్థితుల్లోనూ తాగకూడదు.

ఇంట్లో ఆహార పదార్థాలను తెరిచి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆహారంలో పురుగులు ధూళి పడే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు రావడం తప్పదు. అంతేకాకుండా ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూతపెట్టడం అలవాటు చేసుకోవాలి.

ఇంట్లో ఉప్పును ఉపయోగించిన తర్వాత ఎప్పుడూ డబ్బాను మూసివేయాలి. ఎందుకంటే ఉప్పు చంద్రుని ప్రభావాన్ని సూచిస్తుంది. ఉప్పు డబ్బా తెరిచి ఉంటే అది చంద్రుని బలహీనపరచడంతోపాటు కుటుంబంలో ఒత్తిడిని మానసిక అశాంతిని పెంచే అవకాశముంది. ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే వ్యక్తి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సోమవారం రోజున ఉప్పును దానం చేస్తే దీనివల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.

ఇంట్లో అలమరాలను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. ఎందుకంటే వాస్తు ప్రకారం అలమరా తెరిచి ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఇంట్లో ప్రతి వస్తువు చక్కగా అమర్చబడి ఉండాలి. ముఖ్యంగా డబ్బులు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను పెట్టే అలమరాలను మూసివేయడం తప్పనిసరి.

పుస్తకాలు చదివిన తర్వాత ఎప్పుడూ మూసివేయాలి. చాలా మంది పుస్తకాలను తెరిచి ఉంచడమో చెల్లాచెదురుగా పడేయడమో చేస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇది మంచి అలవాటు కాదు. వేదాల ప్రకారం పుస్తకాలు బుధుడితో సంబంధం కలిగి ఉంటాయి. బుధుడు తెలివితేటలకు ప్రసంగ సామర్థ్యానికి సూచిక. కానీ పుస్తకాలను తెరిచి ఉంచడం వల్ల బుధుడు బలహీనమై మన మనసులో గందరగోళం, ఆర్థిక సమస్యలు, చదువులో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది.

చాలా మంది డబ్బు, బిళ్లు, రసీదులు చెదిరిపోయేలా చెత్తగా వదిలేస్తారు. కానీ ఇది వాస్తు దృష్ట్యా చాలా తప్పు. డబ్బును తగిన రీతిలో ఉంచకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. వాస్తు ప్రకారం డబ్బును చక్కగా అమర్చుకొని అలమరాలో భద్రంగా ఉంచాలి.




