AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva: గంగానదిలో కొట్టుకు వచ్చిన కాశి విశ్వేశ్వరుడిని పోలి ఉండే శివలింగం.. మహిమాన్విత క్షేత్రం ఎక్కడంటే

వందల ఏళ్లనాటి ఈ శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగం హిమాలయాలలో జన్మించిన గంగా నదిలో ప్రవహిస్తూ కనౌజ్‌కు చేరుకుందని చెబుతారు. బనారస్‌లో శివుని శివలింగాన్ని ప్రతిష్టించిన పూజారులే కన్నౌజ్‌లో కూడా ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని నమ్ముతారు. నదిలో దొరికిన ఈ శివలింగాన్ని పుజారీ తనతో పాటు వారణాశికి తీసుకెళ్లాలని భావించాడు. అయితే అప్పుడు ఒక అద్భుతం జరిగింది.

Lord Shiva: గంగానదిలో కొట్టుకు వచ్చిన కాశి విశ్వేశ్వరుడిని పోలి ఉండే  శివలింగం.. మహిమాన్విత క్షేత్రం ఎక్కడంటే
Kannauj Vishwanath Temple
Surya Kala
|

Updated on: Aug 06, 2024 | 1:05 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో విభిన్న నమ్మకాలు కలిగిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంటుంది.అలాంటి ఆలయాల్లో ఒకటి కన్నౌజ్ జిల్లాలోని శివాలయం. ఇది కాశి విస్వేశ్వరుడి ఆలయానికి ప్రతిబింబంగా పరిగణించబడుతుంది. విశేషమేమిటంటే ఈ శివాలయం పేరు కూడా విశ్వనాథ దేవాలయం. దీని వెనుక చాలా ఆసక్తికరమైన విషయం ఉందని అంటున్నారు.

వందల ఏళ్లనాటి ఈ శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయంలోని శివలింగం హిమాలయాలలో జన్మించిన గంగా నదిలో ప్రవహిస్తూ కనౌజ్‌కు చేరుకుందని చెబుతారు. బనారస్‌లో శివుని శివలింగాన్ని ప్రతిష్టించిన పూజారులే కన్నౌజ్‌లో కూడా ఈ శివలింగాన్ని ప్రతిష్టించారని నమ్ముతారు. నదిలో దొరికిన ఈ శివలింగాన్ని పుజారీ తనతో పాటు వారణాశికి తీసుకెళ్లాలని భావించాడు. అయితే అప్పుడు ఒక అద్భుతం జరిగింది. శివయ్య తన మహిమని చూపించాడు. పూజారి గంగానది నుంచి బయటకు తీసిన శివలింగాన్ని నేలపై పెట్టాడు. తర్వాత దానిని కాశికి తీసుకుని వెళ్ళడానికి పుజారీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ శివలింగం ఒక్క అంగుళం కూడా కదలలేదు. ఆ తర్వాత ఈ ప్రదేశంలో శివయ్యను ప్రతిష్టించి పూజలు చేయడం మొదలు పెట్టాడు.

400 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఆలయం

ఇవి కూడా చదవండి

ఈ ఆలయం కన్నౌజ్ రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌధరియన్‌పూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయం 400 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చెబుతారు. ఈ ఆలయంలో ఎవరైతే శివుడిని హృదయపూర్వకంగా పూజిస్తారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారు. ఈ శివాలయం బనారస్‌లోని విశ్వనాథ ఆలయానికి మరో రూపమని భక్తులు భావిస్తారు.

గంగలో ప్రవహిస్తూ వచ్చిన శివలింగం

అప్పట్లో ఇక్కడ గంగా నది ప్రవహించేది.. అప్పుడు ఈ శివలింగం గంగా నదిలో ప్రవహిస్తూ ఇక్కడకు వచ్చిందని పూజారి చెప్పారు. అదే సమయంలో బనారస్ ప్రధాన పూజారి కలలో గంగలో ఒక శివలింగం కొట్టుకుంటూ కనౌజ్‌కు చేరుకుందని కల వచ్చింది. ప్రముఖ పూజారులందరూ ఈ శివలింగాన్ని వెతకడానికి బయలుదేరారు.

ఉన్న చోటు నుంచి కదలని శివలింగం

ఈ సమయంలో అందరూ కనౌజ్‌లోని చౌదర్యాపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఈ శివలింగం గంగా ఒడ్డున ఉంది. ఆ సమయంలో అప్పటికే అర్థరాత్రి కావడంతో శివలింగాన్ని ఓ చోట ఉంచినట్లు పూజారి తెలిపారు. తెల్లవారుజామున శివలింగాన్ని ఎత్తాలని ప్రయత్నం చేసినా శివలింగం ఉన్న చోటు నుంచి కదలలేదు. పూజారి ఈ శివలింగాన్ని తనతో పాటు బనారస్‌కు తీసుకెళ్లాలనుకున్నాడు.. ఈ శివలింగం విశ్వనాథ శివలింగంగాన్ని పోలి ఉంది. అయితే శివలింగం కదలలేదు. దీంతో ఇది శివుడి ఆజ్ఞ గా భావించి.. ఇక్కడ కొలువై ఉండాలనుకుంటున్న శివుని మహిమ అనుకుంటూ అర్చకులు నిర్ణయించుకుని అక్కడే పూజలు చేయడం మొదలు పెట్టారు.

నిత్యం భక్తుల రద్దీ

పూజారులు ఈ శివలింగాన్ని పూర్ణ క్రతువులతో పూజించి అదే స్థలంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ ఆలయానికి బాబా విశ్వనాథ్ అని పేరు పెట్టారు. భారతదేశంలో విశ్వనాథుడు పేరు మీద ఇది రెండవ ఆలయం. మొదటి ఆలయం బనారస్‌లో, రెండవ ఆలయం కన్నౌజ్‌లో ఉంది. శ్రావణ మాసంలో శివుడికి జలాభిషేకం, పాలతో అభిషేకం చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ నిర్మల మైన హృదయంతో పూజించే ప్రతి భక్తుని కోరికలను శివుడు తీరుస్తాడని కొందరు భక్తుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు