AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikalahasti Temple: శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతు పూజలో ఆది అమావాస్య రోజున సరికొత్త రికార్డు

కాళ  హస్తీశ్వర స్వామి ఆలయానికి హిందూ పురాణాలలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. శివుడు, జ్ఞాన ప్రసూనాంబికలు రాహు కేతులుగా వెలిసినట్లు నమ్మకం. దీంతో రాహు, కేతు దోష నివారణ పూజకు ప్రసిద్ది చెందింది. దీంతో జాతకాంలో రాహు కేతు దోష నివారణ కోసం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు. తిరుపతి జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం ఆషాడం మాసం అమావాస్య తిది కనుక రాహుకేతు పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

Srikalahasti Temple: శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతు పూజలో ఆది అమావాస్య రోజున సరికొత్త రికార్డు
Srikalahasti Temple
Surya Kala
|

Updated on: Aug 06, 2024 | 9:14 AM

Share

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శివాలయం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. సువర్ణముఖీ నదీ తీరాన వెలసిన శ్రీకాళహస్తీశ్వరుడు.. స్వయంభువు లింగం. అంతేకాదు పంచభూత క్షేత్రాల్లో వాయు క్షేత్రం శ్రీకాళ హస్తీశ్వర క్షేత్రం. లింగానికి కెదురుగా ఉండే దీపం లింగము నుంచి వచ్చే గాలికి రెపరెపలాడుతుందని చెబుతారు. అంతేకాదు శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ క్షేత్రం అని కూడా అంటారు. అటువంటి శ్రీ కాళ  హస్తీశ్వర స్వామి ఆలయానికి హిందూ పురాణాలలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. శివుడు, జ్ఞాన ప్రసూనాంబికలు రాహు కేతులుగా వెలిసినట్లు నమ్మకం. దీంతో రాహు, కేతు దోష నివారణ పూజకు ప్రసిద్ది చెందింది. దీంతో జాతకాంలో రాహు కేతు దోష నివారణ కోసం భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడ పూజలు చేస్తారు.

తిరుపతి జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం ఆషాడం మాసం అమావాస్య తిది కనుక రాహుకేతు పూజలు నిర్వహించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భారీ భక్తుల సంఖ్య గత రికార్డులను బద్దలు కొట్టింది. ఆది అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి భారీగా తరలివచ్చారని అలయాదికారి చెప్పారు. రాహుకేతు పూజల్లో 9,168 మంది భక్తులు పాల్గొన్నారు. గత ఏడాది జూన్ 18న 7,597 మంది రాహుకేతు పూజల్లో పాల్గొని సృష్టించిన రికార్డ్ ను బీట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.

రోజంతా దాదాపు 33,000 మంది భక్తులు దర్శనం

ఇవి కూడా చదవండి

శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం ఐకానోగ్రఫీ నుండి వచ్చింది. ఇక్కడ ఐదు తలల పాము (కేతు) శివుని తలపై అలంకరించబడి ఉంటుంది. ఒక తల పాము (రాహువు) అమ్మవారు నడుమును చుట్టి ఉంటుంది. ఇక్కడ రాహు కేతు పూజ, శివ పార్వతులకు చేసే పూజలు అత్యంత ఫలవంతం.. జాతకంలో దోషం లేదా ప్రతికూల ప్రభావాలను తగ్గించగలవని భక్తులు నమ్మకం. రాహుకేతు పూజలు రోజంతా జరుగుతుండగా రాహుకాలం కాలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో ఆ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

రాహుకేతు పూజల కోసం 5,183 మంది భక్తులు రూ. 500 టిక్కెట్లు కొనుగోలు చేశారని, 2,288 మంది రూ. 750 టిక్కెట్ల కొనుగోలు చేశారని దేవస్థాన అధికారులు చెప్పారు. అంతేకాదు రూ 1,500ల టికెట్ ను 933 మంది.. రూ. 2,500 టికెట్ ధర 610 మంది కొనుగోలు చేయగా… 154 మంది భక్తులు రూ. 5,000 టిక్కెట్ల ను కొనుగోలు చేసి రాహు కేతు పూజ చేసినట్లు వెల్లడించారు.

రాహుకేతు పూజలతో పాటు శీఘ్ర దర్శనం, ప్రత్యేక ప్రవేశం కోసం 8,162 టిక్కెట్ల అమ్మకం జరిగిందని వెల్లడించింది. మరో వైపు ఆదివారం ఒక్క రోజే 29,505 వివిధ ప్రసాదాల ప్యాకెట్లను విక్రయించినట్లు తెలిపారు. ఇలా కాళహస్తి ఆలయానికి ఒక్కరోజులో కోటి రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపారు.

ఇక్కడ స్వయం భూలింగముగా వెలసిన శివలింగాన్ని సాలెపురుగు, పాము, ఏనుగు అర్చించడమే కాదు.. తమ భక్తీ నిరుపించుకోవడంలో పోటాపోటీగా నిలిచి చివరకు మోక్షాన్ని పొందినట్లు .. అప్పటి నుంచి ఇక్కడ ఉన్న స్వామిని కాళహస్తీశ్వరుడు అని పిలుస్తారని పురాణ కథనం. శ్రీ అనగా సాలెపురుగు, కాళము అనగా పాము, హస్తి అనగా ఏనుగు. అంతేకాదు భక్తిలోని గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన కన్నప్ప కూడా ఇక్కడ ఉన్న శివయ్యనే పుజించాడని కథనం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..