AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: మొదలైన రామ దర్భార్ ప్రతిష్ట కార్యక్రమం.. ఈ నెల 5న స్పెషల్ ప్రణాళికలతో అయోధ్యకు రావద్దంటూ భక్తులకు విజ్ఞప్తి..

అయోధ్యలో కొలువైన బాలరామయ్యను చూసేందుకు కోట్లాది రామ భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. అయితే జూన్ 5వ తేదీన అయోధ్యకు రావద్దని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ భక్తులకు ఈ విషయం చెప్పారు. రామ దర్బార్ లో విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రణాళికలు రూపొందించుకుని భక్తులు అయోధ్యకు రావద్దన్నారు. ఎందుకంటే వాతావరణం దృష్ట్యా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం లేదని తెలిపారు.

Ayodhya: మొదలైన రామ దర్భార్ ప్రతిష్ట కార్యక్రమం.. ఈ నెల 5న స్పెషల్ ప్రణాళికలతో అయోధ్యకు రావద్దంటూ భక్తులకు విజ్ఞప్తి..
Ayodhya Ram Temple
Surya Kala
|

Updated on: Jun 03, 2025 | 2:49 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆలయంలో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. 2024 జనవరి 22న గర్భ గుడిలో బాల రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇప్పుడు రెండవ ప్రాణ ప్రతిష్ఠ వేడుక ఈ రోజు నుంచి ప్రారంభమైంది, ఇది జూన్ 5న రామ్ దర్బార్ లోని విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠతో పూర్తవుతుంది. గంగా దసరా కూడా జూన్ 5న జరుపుకోనున్నారు. అయితే రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ ఆలయంలో జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు రామ దర్భార్ ను దర్శనం చేసుకోలేరు.

రామ దర్భార్ ను చూసేందుకు ప్రణాళిక వేసుకుంటున్న భక్తులు ఈ నెల 5న భక్తులు అయోధ్యకు రావద్దని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే వాతావరణం దృష్ట్యా రామ దర్భార్ ప్రతిష్ట సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఈ కార్యక్రమం కోసం ఎవరినీ ఆహ్వానించలేదని చెప్పారు. ఆయన సోషల్ మీడియా ద్వారా భక్తులను కోరారు.

ముఖ్య అతిథిగా సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు

అయితే.. భక్తులు యధావిధిగా బాల రామయ్యను దర్శనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. అంతేకాని ప్రత్యేక ప్రణాళికతో మాత్రం భక్తులు అయోధ్యకు రావద్దని అభ్యర్థించారు. రామమందిరం మొదటి అంతస్తులో రామ దర్బార్‌తో పాటు.. ఆలయ ప్రాంగణంలో మిగిలిన 6 దేవాలయాలను కూడా ప్రతిష్టించనున్నారు. ఇవి గణేశుడు, శివుడు, భగవతి, హనుమంతుడు, సూర్యుడు, అన్నపూర్ణ దేవి సహా శ్రీ విష్ణువు అవతారంలోని మిగిలిన విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. వీటికి సంబంధించిన ఆచారాలు ఈరోజు (జూన్ 3వ తేదీ మంగళవారం) నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఇవి కూడా చదవండి

అభిజీత్ ముహూర్తంలో రామ దర్బార్ పవిత్రీకరణ

జూన్ 5న ఉదయం 6:30 గంటలకు రామ దర్భార్ ప్రతిష్ట కార్యక్రమానికి కర్మ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠ ఉదయం 11:30 గంటలకు అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగే సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉంటారు. మధ్యాహ్నం 1 గంట వరకు రామ దర్భార్ కు సంబంధించిన కార్యక్రమాలు జరగనున్నవి. సోమవారం ఉదయం జూన్ 2వ సరయు ఒడ్డున మాతృ శక్తి ద్వారా భక్తితో గొప్ప కలశ యాత్ర జరిగింది. ఈసారి ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తాన్ని అయోధ్య పండితులు నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..