Ayodhya Ram Mandir: భక్తుల దర్శనానికి సిద్ధమవుతున్న అయోధ్య రామమందిరం.. ఓపెనింగ్ ఎప్పుడంటే..

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం చక చకా పూర్తవుతోంది. త్వరలోనే భక్తులకు..

Ayodhya Ram Mandir: భక్తుల దర్శనానికి సిద్ధమవుతున్న అయోధ్య రామమందిరం.. ఓపెనింగ్ ఎప్పుడంటే..
Ayodhya Ram Mandir
Follow us

|

Updated on: Oct 25, 2022 | 7:03 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం నిర్మాణం చక చకా పూర్తవుతోంది. త్వరలోనే భక్తులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. 2024 నాటికి ఆలయం పూర్తయి.. భక్తులకు స్వాగతం పలుకనుందని అయోధ్య శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చెబుతోంది. 2024 జనవరి నాటికి రామ మందిరం నిర్మాణం పూర్తవుతుందని, భక్తులకు ఆలయాన్ని సందర్శించవచ్చునని మంది నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

5 ఆగస్టు 2020 ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు. నాటి నుంచి ఆలయ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆలయ నిర్మాణ పనుల్లో పురోగతి సంతృప్తికరంగా ఉందన్నారు.

సంక్రాంతి పర్వదినాన..

2024 జనవరిలో మకర సంక్రాంతి పర్వదినాన ఆలయం గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాలను ప్రతిష్ఠించిన తర్వాత ఆలయానికి భక్తులను అనుమతించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ఆలయ గ్రౌండ్‌ ఫ్లోర్‌ను సిద్ధం చేస్తామని, జనవరి 14, 2024 నాటికి శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని చెప్పారు. రామ మందిర నిర్మాణానికి రూ. 1,800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు రాయ్‌ తెలిపారు. అంతేకాదు.. ప్రముఖ హిందూ ధర్మాచార్యుల విగ్రహాల ఏర్పాటు కోసం ఆలయ పరిసరాల్లో స్థలం ఏర్పాటు చేయనున్నట్లు రాయ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..