Solar Eclipse 2022: అసలు గ్రహణం అంటే ఏంటి? మూఢ నమ్మకాలేవి? నిజాలేవి?.. నిజానిజాలు మీకోసం..
ఇవాళ పాక్షిక సూర్యగ్రహణం. ఈ ఏడాదిలో రెండవది.. చివరి సూర్యగ్రహణం ఇది. సాయంత్రం 4 గంటలా 29 నిమిషాలకు ప్రారంభమై.. 6 గంటల 32 నిమిషాలకు ముగుస్తుంది.
ఇవాళ పాక్షిక సూర్యగ్రహణం. ఈ ఏడాదిలో రెండవది.. చివరి సూర్యగ్రహణం ఇది. సాయంత్రం 4 గంటలా 29 నిమిషాలకు ప్రారంభమై.. 6 గంటల 32 నిమిషాలకు ముగుస్తుంది. గరిష్టంగా గంటా 45 నిమిషాలపాటు గ్రహణకాలం ఉంటుంది. అయితే, 27ఏళ్ల తర్వాత దీపావళి రోజున ఈ సూర్యగ్రహణం ఏర్పడుతోంది. 1995లో దీపావళి రోజున సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు దీపావళి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. మళ్లీ వచ్చే దశాబ్ధం వరకు ఇలాంటి అరుదైన సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే, ఈ సూర్యగ్రహణంపై ప్రజల్లో అనేక అపోహలు, మూఢ విశ్వాసాలు, అపనమ్మకాలు ఉన్నాయి. వాటి కారణంగా ఏళ్లకోసారి వచ్చే ఖగోళ అద్భుతాన్ని అదేదో చెడు దృశ్యంగా భావించి, భయాందోళనతో ఇళ్లకే పరిమితమైపోతున్నారు. కనీసం ఆహారం తీసుకోవడానికి కూడా జంకుతున్నారు.
మరి ఇంతకీ గ్రహణం అంటే ఏంటి?
అసలు గ్రహం అంటే ఏంటి? అని అడిగితే.. అదొక ఆసక్తికర ఖగోళ ప్రక్రియ. ఒక గ్రహం నీడ మరో గ్రహంపై పడటమే గ్రహణం. సూర్యుని వెలుగు భూమి మీద పడకుండా మధ్యలో చంద్రుడు అడ్డంగా వస్తే అది సూర్యగ్రహణం అవుతుంది. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వస్తే చంద్రగ్రహణం అవుతుంది. అయితే, సూర్య గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. సూర్య గ్రహణ సమయంలో కేవలం కంటికి మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ సూర్య గ్రహణాన్ని నేరుగా చేస్తూ కంటి చూపు దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంటుంది. అయితే, గ్రహణం వ్యక్తులపై, వ్యక్తుల జీవితంపై చెడు ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సైంటిస్టులు చెబుతున్నారు.
ప్రజల నమ్మకాలు..
1. అన్నం, నీళ్లు ముట్టకూడదు.
2. 2 గంటల ముందే తినాలి.
3. గర్భవతులు బయటకు రావొద్దు.
4. మొర్రి వచ్చే అవకాశాలు.
5. ప్రతికూల శక్తితో అనర్థాలు.
6. చెడు సమయం, ఏ పని చేయకూడదు.
సైంటిస్టులు చెప్తున్న నిజాలు..
1. అన్నం తినొచ్చు, నీళ్లు తాగొచ్చు.
2. ఏ టైమ్‌లోనైనా తినొచ్చు.
3. కడుపులో బిడ్డకు హానీ జరగదు.
4. జన్యులోపాలతోనే మొర్రి.
5. నెగిటివ్ ఎనర్జీ విడుదల కాదు.
6. ఏం చేసినా ఏమీ కాదు.
అయితే, ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇండియా, నార్త్ ఈస్ట్ ఆఫ్రికా, యూరోప్ లోని కొన్ని దేశాలు, నార్త్ అట్లాంటిక్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్ ప్రాంతాల్లో గ్రహణాన్ని చూడవచ్చు. మన దేశంలో గ్రహణం – ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలు కింద చూద్దాం..
1. ఢిల్లీ – సా. 4.29 నుంచి సా. 5.30 వరకు.
2. ముంబై – సా.4.49 నుంచి సా.5.42 వరకు.
3. హైదరాబాద్ – సా.4.59 నుంచి సా.5.45 వరకు.
4. బెంగళూరు – సా.5.12 నుంచి సా.5.49 వరకు.
5. కోల్‌కతా – సా.4.52 నుంచి సా.5.01 వరకు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..