AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఇలాంటి వారితో స్నేహం మనకే నష్టం..! నమ్మితే నట్టింట మునిగిపోవడం ఖాయం..!

కౌటిల్యుడు, విష్ణుగుప్తుడిగా ప్రసిద్ధి పొందిన చాణక్యుడు మనిషి తన జీవితంలో ఏయే మార్గంలో నడిస్తే.. సంతోషకరమైన జీవనాన్ని గడపగలుగుతాడనే విషయాలను సవివరంగా తెలిపాడు. దానికి సంబంధించిన చాణక్య నీతి గ్రంధంలో ఈ వివరాలు సక్షిప్తమై ఉన్నాయి. అయితే ప్రతి ఒక మనిషి..

Chanakya Niti: ఇలాంటి వారితో స్నేహం మనకే నష్టం..!  నమ్మితే నట్టింట మునిగిపోవడం ఖాయం..!
Chanakya Neeti
శివలీల గోపి తుల్వా
|

Updated on: Apr 08, 2023 | 6:10 AM

Share

సమస్త భారతదేశాన్ని ఒకప్పుడు ఏలిన మౌర్య సమాజ్య తొలి చక్రవర్తి చంద్రగుప్తుడు మౌర్యుడు గొప్ప రాజు. అయితే ఆయన అలా గొప్పతనాన్ని గడించడంలో ఆయన ప్రధానమంత్రి చాణక్యుడు చేసిన కృషి, అందించిన సూచనాలే కారణం అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన మహా జ్ఞాని. అందుకే ఈ నాటికీ తెలివైనవారిని అపర చాణక్యుడు అని సంబోధిస్తారు. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడిగా ప్రసిద్ధి పొందిన చాణక్యుడు మనిషి తన జీవితంలో ఏయే మార్గంలో నడిస్తే.. సంతోషకరమైన జీవనాన్ని గడపగలుగుతాడనే విషయాలను సవివరంగా తెలిపాడు. దానికి సంబంధించిన చాణక్య నీతి గ్రంధంలో ఈ వివరాలు సక్షిప్తమై ఉన్నాయి. అయితే ప్రతి ఒక మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమస్యని నిత్యం ఎదుర్కొంటూ ఉంటారు. ఎలా అయితే మన జీవితంలో ఆనందం ఉంటుందో అలానే కష్టాలు కూడా ఉంటాయి. ఓ రోజు దుఃఖము ఉంటే ఓ రోజు సుఖం ఉంటుంది, ఇదే జీవితం కూడా.

అయితే కష్టాలను ఎలా అధిగమించాలి..? అసలు కష్టాలు కలగకుండా, ఎదురవకుండా ఎలా నడుచుకోవాలి..? అందుకు కారణాలేమిటి..? అనే విషయాలను చాణక్యుడు తన చాణక్య నీతిలో ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలోనే కష్టాల కొలిమిలో నలిగిపోకుండా, పడకుండా ఉండేందుకు కొందరికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. పైకి చూడడానికి కొందరు చాలా బాగా కనపడతారని వాళ్ళతో స్నేహం మనకే ప్రమాదం అని చాణక్య అన్నాడు. ఇటువంటి వ్యక్తులతో మనం ఉంటే నిత్యం కష్టం నష్టమే తప్ప ఫలితమేమి ఉండదని చాణక్యుడు చెప్పాడు. మరి చాణక్యుడి ప్రకారం ఎలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

అహంకారం: అహంకారం ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి. మీరు స్నేహం చేసే వ్యక్తిలోని అహంకారం వలన మీకే హాని కలుగుతుంది అని చాణక్య అన్నాడు. అహంకారం ఉన్న వ్యక్తి మన ప్రగతిని ఉన్నతిని చూసి సహించలేరు, అలాంటప్పుడు మీకు ఏదైనా నష్టం కలుగుతుంది. అలానే ఇటువంటి వ్యక్తులు తప్పులుని అస్సలు అంగీకరించరని చాణక్య అన్నాడు. పైగా వీళ్ళతో స్నేహం ప్రమాదమన్నాడు.

ఇవి కూడా చదవండి

మోసం చేసే వాళ్ళు: మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా స్వార్థం కోసమే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా దూరంగా ఉండాలి. మోసం చేసే వాళ్ళని నమ్మితే మనమే మోసపోవాల్సి వస్తుంది.

నిత్యం స్త్రీ వెంటపడేవారు: నిత్యం స్త్రీ వెనుక పడే వాళ్ళతో కూడా దూరంగా ఉండాలి వీళ్ళతో కూడా ఎప్పుడు ప్రమాదమే అని చాణక్య అన్నాడు.

అత్యాశ, స్వార్ధపరులు: అత్యాశ స్వార్థపరులకు కూడా దూరంగా ఉండాలి అతిగా ఆశపడే వాళ్ళకి స్వార్థపరులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళతో స్నేహం కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..