Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Customs: సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా..? నవ వధూవరులతో ప్రత్యకంగా చేయించడానికి కారణమిదే..!

సనాతన ధర్మంలోని ప్రతి ఆచారానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అలాంటి ఆచారాలలో సత్యనారాయణ వ్రతం కూడా ప్రధానమైనది. చాలా మంది హిందువులు ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. కొందరైతే ఏదైనా సందర్భం వచ్చిన ప్రతిసారీ

Hindu Customs: సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా..? నవ వధూవరులతో ప్రత్యకంగా చేయించడానికి కారణమిదే..!
Satyanarayana Vratham
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 08, 2023 | 6:05 AM

సనాతన ధర్మంలోని ప్రతి ఆచారానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అలాంటి ఆచారాలలో సత్యనారాయణ వ్రతం కూడా ప్రధానమైనది. చాలా మంది హిందువులు ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. కొందరైతే ఏదైనా సందర్భం వచ్చిన ప్రతిసారీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. అలాగే ఇల్లు కట్టినా, పెళ్లి రోజు లేదా ముఖ్యమైన రోజులలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. శాస్త్రాల ప్రకారం కొత్త ఇల్లు గృహప్రవేశం అయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం తప్పక చెయ్యాలి. అలానే పెళ్లయిన తర్వాత కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేయడం తరతరాల నుంచి వస్తున్న ఆచారం.

అయితే మీకు ఈ ఆలోచన ఎప్పుడైనా కలిగిందా..? ఎందుకు కొత్తగా పెళ్లయిన జంట చేత సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయిస్తారు అని.పెళ్లయిన తర్వాత కొత్త కోడలిని అత్త వారింటికి తీసుకెళ్లి ఆ తర్వాత కొడుకు, కోడలితో ఈ వ్రతం చేయిస్తారు. తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టింటికి వధూవరులను తీసుకు వస్తారు. వివాహం తర్వాత ఏ ఇబ్బందులు భార్య భర్తలకి కలగకూడదని, ఎలాంటి సమస్యలు రాకూడదని, ఒడిదుడుకులు ఏమీ లేకుండా కలహాలు రాకుండా నూతన వధూవరులు ఆనందంగా ఉండాలని సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం వలన ఏ ఒడిదుడుకులు లేకుండా భార్యాభర్తలు ఆనందంగా ఉండేందుకు సత్యనారాయణ స్వామి వారు కాపాడతారని హిందువులు నమ్మకం.

సత్యనారాయణ స్వామి భక్త సులభుడు. అయితే జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన సామాగ్రిని కొనడానికి, ఆనందంగా జీవితాన్ని గడపడానికి సత్యనారాయణ స్వామి అనుగ్రహం తప్పక ఉండాలని ప్రతితి. ఆ కారణంగానే ఈ వ్రతం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. అందుకనే పెళ్లయిన తర్వాత సమస్యలు ఏమి ఉండకూడదని వధూవరులు ఆనందంగా ఉండాలని ఈ వ్రతాన్ని చేయిస్తారు. ఈ వ్రతం చేసిన రోజు అందరినీ పిలుస్తారు. పైగా అందరూ రావడం వలన కోడల్ని చూస్తారు. కోడల్ని పరిచయం చేసినట్టు కూడా అవుతుంది కోడలు కూడా అందరితో కలవడానికి ఒక అవకాశం వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..