Astro Tips: ఈ చెట్టు దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది.. కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది..!
Astro Tips: హిందూమతంలో చెట్ల మొక్కల లక్షణాలు, వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. అలాంటి చెట్లలో ఇవాళ మనం..
Astro Tips: హిందూమతంలో చెట్ల మొక్కల లక్షణాలు, వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. అలాంటి చెట్లలో ఇవాళ మనం తెల్ల జిల్లేడు చెట్టు ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ఈ చెట్టును వాడుక బాషలో జిల్లెడు అని పిలుస్తుంటాం. బంజరు భూమి సహా ఎక్కడబడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తుంటుంది. ఇది తెలుపు, లేత ఊదా రంగు పువ్వులను కలిగి ఉంటుంది. అయితే, విఘ్నహర్త గణేశుడు స్వయంగా ఈ జిల్లెడు చెట్టులో కొలువై ఉంటాడని ప్రతీతి. దీని పూలు శివునికి చాలా ప్రీతికరమైనవి. ఈ మొక్కను ఇంట్లో శుభ ముహూర్తంలో పెడితే, అద్భుతమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.. జ్యోతిష్కుడు డాక్టర్ అరవింద్ మిశ్రా ప్రకారం.. ఒక వ్యక్తికి అంతుచిక్కని వ్యాధి సోకినట్లయితే, ఈ జిల్లెడు చెట్టు అటువంటి వ్యాధిని గుర్తించి.. ఆ వ్యాధి తగ్గేందుకు ఉపకరిస్తుంది. ఇందుకోసం.. ఆదివారం పుష్య నక్షత్రంలో ఆకు వేరును ఇంటికి తీసుకొచ్చి గంగాజలంతో కడిగాలి. ఈ వేరుకు పచ్చిమిర్చి పూసి ధూపం వేయాలి. ఆ తరువాత, గణపతి 108 మంత్రాలను భక్తితో జపించాలి. ఆ తరువాత, రోగి తలపై నుండి 7 సార్లు వేరును తిప్పాలి. సాయంత్రం నిర్మానుష్య ప్రదేశంలో దానిని పాతిపెట్టాలి. ఇలా చేసిన కొంతసేపటి తరువాత వ్యక్తికి సోకిన వ్యాధి/జబ్బు ఏంటనేది తేలుతుందని చెబుతున్నారు.
పిల్లలు సంతోషంగా ఉండాలంటే.. జిల్లెడు చెట్టు వేరుకాండం పిల్లలకు ఆనందాన్ని కలిగిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. సంతాన సాఫల్యం కోసం స్త్రీ జిల్లేడు వేరు ముక్కను తమ నడుముకు కట్టుకోవాలి. తర్వాతి పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలి. ఇలా చేయడం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం.
చేతబడిని అడ్డుకుంటుంది.. రావిపుష్య యోగంలో ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తెల్ల జిల్లేడు చెట్టును నాటాలి. ఈ మొక్క ఇంటిని చెడు దృష్టి, చేతబడి, తంత్ర-మంత్రాల దుష్ప్రభావాల నుండి కాపాడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా కుటుంబంపై దుష్టశక్తుల ప్రభావం, దురదృష్టం, దుష్ట గ్రహాల ప్రభావం ఉండదు. ఒక వ్యక్తి తాంత్రిక చర్యకు గురైతే, జిల్లేడు వేరు ముక్కను నడుముకు కట్టాలి. తద్వారా వారిపై చేసిన తాంత్రిక చర్య ఫలించదు.
అదృష్టాన్ని తీసుకువస్తుంది.. తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో అదృష్టాన్ని తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నట్లయితే.. తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టి, అదృష్టాన్ని తీసుకువచ్చే గణపతి శక్తనాశన స్త్రోత్రాన్ని పఠించండి.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, మత గ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)
Also read:
Actor Srinu: టాలీవుడ్లో మరో విషాదం.. అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి..
AP Govt Employees: ఏపీ ఎన్జీవోల సంఘం సంచలన నిర్ణయం.. ఫిబ్రవరి 7 తరువాత ఏ క్షణమైనా..
Dilraju: సుకుమార్ రైటింగ్ బ్యానర్లో ఆశిష్ సెల్ఫిష్ మూవీ.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..