Sabarimala: శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం.. జిలెటిక్‌స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్న భద్రత బలగాలు..

Sabarimala: శబరిమలలో పేలుడు పదార్థాల కలకలం.. జిలెటిక్‌స్టిక్స్‌ను స్వాధీనం చేసుకున్న భద్రత బలగాలు..
Sabarimala

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం క్షేత్రం శబరిమలలో ఒక్కసారిగా కలకలం రేగింది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. దీంతో పోలీసులుజజ

Sanjay Kasula

|

Jan 20, 2022 | 10:33 AM

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం క్షేత్రం శబరిమలలో (Sabarimala temple) ఒక్కసారిగా కలకలం రేగింది. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. దీంతో పోలీసులు, ఆలయ అధికారులు అలెర్ట్ అయ్యారు. శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలో పెన్ ఘాట్ వంతెన కింద జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. అసలు ఇవి ఇక్కడకి.. ఎక్కడ నుంచి వచ్చాయనే అంశంపై విచారణ మొదలు పెట్టారు భద్రతా అధికారులు. ఎవరు తీసుకువచ్చారనే దానిపై విచారణ జరుగుతోంది. మొత్తంగా 6 జిలెటిన్ స్టిక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. బాంబ్ స్వ్యాడ్ మొత్తం తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు బాంబు స్క్వాడ్‌ సాయంతో అయ్యప్ప ఆలయ మార్గంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఇటీవల మకరజ్యోతి దర్శనానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చిన సంగతి తెలిసిందే. మకర జ్యోతి దర్శనం అనంతరం ఇవాళ్టి నుంచి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: Budget 2022: సామాన్యుల జీవన చక్రం.. పరుగుల బండిపై నిర్మలమ్మ నజర్.. రైల్వేపై ఎలా..

Black Diamond: దుబాయ్‌లో అతి పెద్ద నల్ల వజ్రం ఆవిష్కారం.. ఈ బ్లాక్ డైమండ్‌ చాలా స్పెషాల్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu