Encounter with Murali Krishna: హనుమంతుడి జన్మస్థలంపై పండితులంతా కూర్చుని మాట్లాడుకుంటే మంచిది.. టీవీ9తో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
హనుమంతుడి జన్మస్థలంపై టీటీడి చూపించిన ఆధారాలపై హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సందేహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇదే అంశంపై మరిన్ని వివరాలను....
హనుమంతుడి జన్మస్థానం కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలగా గుర్తించామని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. హనుమంతుడి జన్మస్థలం తిరుమల అని నిర్థారించామని అధికారికంగా శ్రీరామ నవమి రోజే టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సప్తగిరుల్లో ఆకాశగంగ సమీపంలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానమని.. పౌరాణిక,శాసన, చారిత్రక ఆధారాలు కమిటీ సమర్పించింది. ఈ విషయాలను తిరుమల నాదనీరాజనం వేదికగా జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ఆచార్య మురళీధర శర్మ ప్రకటించారు. అన్ని పురాణాల్లో అంజనాదేవి వెంకటాచలానికి వచ్చారని .. ఆకాశగంగ తీర్థం సమీపంలో అంజనాదేవి 12 ఏళ్లు తపస్సు చేశారని ఉందన్నారు. వాయుదేవుడి ఇచ్చిన ఫలాన్ని తిన్న అంజనాదేవికి హనుమంతుడు జన్మించారని వివరించారు.
అంజనాద్రి కొండలో హనుమంతుడు జన్మించాడని ఆధారాలతో నిరూపించేందుకు 2020 డిసెంబరులో టీటీడీ ఓ కమిటీని నియమించింది టీటీడీ. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం వీసీ, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ పాటు ఇస్రో శాస్త్రవేత్త, రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు హనుమంతుడి జన్మస్థలంపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా టీటీడి సమర్పించింది. అయితే, హనుమంతుడి జన్మస్థలంపై టీటీడి చూపించిన ఆధారాలపై హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు సందేహాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇదే అంశంపై మరిన్ని వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో ఎన్‌కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో మాట్లాడారు.