Horoscope: ఈ రాశి వారికి గతంలో తెలిసి తెలియక చేసిన తప్పులు వెంటాడుతుంటాయి.. ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో..
Horoscope Today: క్యాలెండర్‌లో మరో కొత్త నెల ప్రారంభమైంది. మరి కొత్త నెల తొలి రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకొని దానికి తగినట్లుగా ప్రణాళికలు చేసుకుంటే అంతా మేలు జరుగుతుంది...
Horoscope Today: క్యాలెండర్‌లో మరో కొత్త నెల ప్రారంభమైంది. మరి కొత్త నెల తొలి రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకొని దానికి తగినట్లుగా ప్రణాళికలు చేసుకుంటే అంతా మేలు జరుగుతుంది. మరి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేష రాశి:
మేషరాశి వారు ఈరోజు ఇతరులపై సానుభూతి, దయ చూపిస్తారు. మోకాళ్లకు సంబంధించిన అనారోగ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంగారక అర్చన ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
వృషభ రాశి:
వృషభ రాశి వారు ఈరోజు గౌరవ మర్యాదలు, హుందాతనాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. శివ పంచాక్షరి జపం మేలు చేస్తుంది.
మిధున రాశి:
ఈ రాశి వారికి ఈరోజు నిద్ర, విసర్జన వ్యవస్థకు సంబంధించి అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనిగ్రహ అర్చన మేలు చేస్తుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఉమ్మడి వ్యవహారిక విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. పేద వారికి బబ్బర్లు సాయంగా అందిస్తే వీరికి మంచి జరుగుతుంది.
సింహ రాశి:
సింహ రాశి వారు విలువైన వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేసుకోవడం మంచిది.
కన్య రాశి:
ఈ రాశి వారు ఈరోజు వారి పిల్లల ఆరోగ్య, విద్యా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సుబ్రమణ్య స్వామి అర్చన ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
తులా రాశి:
తులా రాశి వారు వాహన, వ్యక్తిగత సౌకర్యాల విషయంలో ముందు చూపుతో ఉండాలి. ఉదర సంబంధమైన ఆరోగ్యాలను కాపాడుకోవాలి. క్రీమ్ అచ్చుదానంద గోవింద అనే నామస్మరణ మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారు ఈ రోజు చిన్న స్థాయిలో ఉద్యోగాలు చేసేవారు క్రమ శిక్షణతో వ్యవహరించాలి. విష్ణు సహస్త్ర నామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు ఈరోజు ఇంట్లో పెద్దలకు తోడ్పాటుగా ఉండే ప్రయత్నం చేయాలి. మానసికంగా కొంత చికాకు కనిపిస్తుంది. శివ పంచాక్షరి జపం మేలు చేస్తుంది.
మకర రాశి:
మకరా రాశి వారు ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మంచి చేస్తుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో తెలిసి తెలియక చేసిన తప్పులు వెంటాడుతుంటాయి. శివపూజ ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మీన రాశి:
మీన రాశి వారికి కుటుంబ సంబంధమైన ప్రయోజనాలు వెంటాడుతుంటాయి. విశేషమైన శుభవార్తలను వింటారు. మహా లక్ష్మీ అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
Google Chrome: గూగుల్ క్రోమ్ కొత్త అప్‌డేట్ .. మరింత వేగంగా పని చేయనున్న గూగుల్ వెబ్ బ్రౌజర్
Getup Srinu Wife: గెటప్ శ్రీను భార్య అకౌంట్ హ్యాక్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కమెడియన్…