AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Getup Srinu Wife: గెటప్ శ్రీను భార్య అకౌంట్ హ్యాక్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన క‌మెడియ‌న్…

జబర్దస్త్ చాలామందికి లైఫ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ షో ద్వారా చాలామంది క‌మెడియ‌న్స్ టాలెంట్ ప్రపంచానికి ప‌రిచ‌యం కాగా..

Getup Srinu Wife: గెటప్ శ్రీను భార్య అకౌంట్ హ్యాక్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన క‌మెడియ‌న్...
Get Up Srinu Wife
Ram Naramaneni
|

Updated on: Jun 01, 2021 | 7:03 AM

Share

జబర్దస్త్ చాలామందికి లైఫ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ షో ద్వారా చాలామంది క‌మెడియ‌న్స్ టాలెంట్ ప్రపంచానికి ప‌రిచ‌యం కాగా.. వంద‌ల కుటుంబాలు షోపై ఆధార‌ప‌డి జీవినం సాగిస్తున్నాయి. ఈ షో ద్వారా పరిచ‌య‌మైన చాలామంది యాక్ట‌ర్స్ టీవీ, సినీ రంగాల్లో రాణిస్తున్నారు. అందులో ఒక‌రు గెటప్ శ్రీను. విభిన్న‌మైన గెట‌ప్‌ల‌తో బుల్లితెర కమల్ హాసన్ అనే బిరుదు ద‌క్కించుకున్నాడు. ఇక గెటప్ శ్రీనుది ప్రేమ వివాహాం అన్న విష‌యం తెలిసిందే. తన భార్య సుజాత గురించి చాలా షోల్లో, ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్య‌మాల్లో గెటప్ శ్రీను ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎంతగానో వైరల్ అవుతుంటాయి. కాగా గెటప్ శ్రీను భార్య సుజాత తాజాగా కొత్త బిజినెస్ ప్రారంభించారు. సుజిశ్రీన్ కలెక్షన్స్ అంటూ మహిళలు, అమ్మాయిలకు అవసరమైన వస్తువులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే త‌న‌ పాత అకౌంట్ హ్యాక్ అవ్వడంతో కొత్త ఖాతాను ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు.

“హాయ్ అందరికీ నమస్కారం.. నా పేరు సుజాత.. సుజిశ్రీన్ కలెక్షన్ గురించి అందరూ అడుగుతున్నారు.. నా పాత ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు.. ఎడిట్ చేసేశారు. అందుకే కొత్త ఖాతా క్రియేట్ చేశాం. దయచేసి అందరూ ఫాలో అవ్వండి. వెరైటీ జువెల్లరిల కోసం గోల్డ్ టచ్‌ను ఫాలో అవ్వండి” అని సుజాత పేర్కొన్నారు. ఇక ఈ వీడియోను గెటప్ శ్రీను తన అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ తన భార్యకు మద్దతివ్వమని కోరారు.

Also Read: తిప్ప‌తీగ‌తో అత‌డి ల‌క్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు

ఈ రోజు నుంచి మార్కెట్లోకి రానున్న డీఆర్‌డీవో మందు.. అందుబాటులోకి 6-8 లక్షల 2డీజీ మెడిసిన్ ప్యాకెట్లు