AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం.. జాగ్రత్తలు తప్పనిసరి

Horoscope Today: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో..

Horoscope Today: ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు.. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం.. జాగ్రత్తలు తప్పనిసరి
Today Rashiphalalu
Subhash Goud
|

Updated on: May 31, 2021 | 8:09 AM

Share

Horoscope Today: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించే వారు చాలా మంది ఉంటారు. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు సోమవారం (మే 31న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈ రాశివారు ఈ రోజు ఎవరితోనైతే విబేధాలు ఉంటాయో వారితో తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గణపతి ఆరాధన మేలు చేస్తుంటుంది.

వృషభరాశి:

ఈ రాశివారికి ఈ రోజు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతుంటాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులున్నవారికి కొంత కుదుట పడుతుంటుంది. గృహగ్రహ అర్చన మేలు చేస్తుంది.

మిథున రాశి

ఈ రాశివారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా, శారీరకంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సూర్యగ్రహ ఆరాధన మేలు చేస్తుంటుంది.

కర్కాటక రాశి

ఈ రాశివారు అనుకునే పనులను పూర్తి చేసుకుంటుంటారు. మరిన్ని మంచి విషయాల కోసం నవగ్రహ పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

సింహ రాశి

ఈ రాశివారికి స్నేహితులు, బంధువుల సహకారం ఎంతో లభించబోతోంది. వేర్వేరు రూపాల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అంగారక గ్రహస్తోత్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంది.

కన్యరాశి

కన్యరాశివారు ఇతరులతో విరోధాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేకపోతో విరోధాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. దుర్గ అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.

తులా రాశి

కుటుంబ ఆరోగ్య విషయంలో ఈ రాశివారు కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఆదిత్య హృదయస్తోత్ర పారాయణం మేలు చేస్తుంటుంది.

వృశ్చిక రాశి

ఈ రాశివారికి వస్త్రా, ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. గొంతుకు సంబంధించిన ఆనారోగ్య సమస్యలు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ రోజు విష్ణుసహస్రనామ పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.

ధనుస్సు రాశి

ఆర్థికంగా కొంత ఇబ్బందులకు గురవుతుంటారు ఈ రాశివారు. అలాగే మనసును ప్రశాంతంగా ఉండేలా చేసుకోవాలి. శివ పంచక్షరి జపం మేలు చేస్తుంటుంది.

మకర రాశి

ఉద్యోగ, విద్య సంబంధిత అంశాల్లో కొంత ముందుడుగు వేస్తారు. మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సూర్యగ్రహ ఆరాధాన ఎంతో మేలు చేస్తుంటుంది.

కుంభరాశి

ఈ రాశివారికి ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే కొంత ఒత్తిడికి గురవుతుంటారు. చర్మ సంబంధిత అంశాల్లో , ఆనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విష్ణపంజరి స్తోత్ర పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.

మీన రాశి

ఈ రాశివారు ఈ రోజు ఇతరుల నుంచి సంపూర్ణమైన సహకారం పొందుతారు. కంటికి సంబంధించిన వ్యాధులుంటే తగ్గిపోతాయి. మహాలక్ష్మి అమ్మవారి పారాయణం ఎంతో మేలు చేస్తుంటుంది.