Tirumala: తిరుపతి అభివృద్ధికి ఆలయ నిధుల కేటాయించాలని టీటీడీ ప్రతిపాదన.. నో చెప్పిన ఏపీ సర్కార్..
తిరుపతి అభివృద్ధికి ఒక్క శాతం శ్రీవారి ఆలయ నిధులను వెచ్చించాలని ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇది సరికాదంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీటీడీ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం నో చెప్పేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. హిందు ధర్మంలో భక్తులు దేవుడికి తమ సంపాదనను భక్తితో హుండీలో మొక్కులుగా సమర్పణ చేసే కానుకల విషయంలో గట్టి విశ్వాసాలు ఉంటాయని భక్తులు అన్నారు.
తిరుపతి అభివృద్ధికి ఆలయ నిధుల కేటాయించాలన్న టీటీడీ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఇదే విషయంపై గత కొంతకాలంగా బీజేపీ నేతలు, భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన నిధులు ఆలయాభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం కూడా టీటీడీ ప్రతిపాదనను తిరస్కరించింది. దీని వెనుక ఉన్న రీజన్ ఏమిటంటే..
తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు వినియోగించాలన్న ఆలోచనపై తీవ్ర విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కితగ్గింది. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల్లో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ తీసుకున్న నిర్ణయించగా వివాదం రేగింది. ఈ క్రమంలో.. టీటీడీ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది.
తిరుపతి అభివృద్ధికి ఒక్క శాతం శ్రీవారి ఆలయ నిధులను వెచ్చించాలని ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇది సరికాదంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో టీటీడీ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం నో చెప్పేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. హిందు ధర్మంలో భక్తులు దేవుడికి తమ సంపాదనను భక్తితో హుండీలో మొక్కులుగా సమర్పణ చేసే కానుకల విషయంలో గట్టి విశ్వాసాలు ఉంటాయని భక్తులు అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ హిందూ దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని ఏ ప్రభుత్వాలూ, వ్యక్తులు ఆశించరు, ఇతర అవసరాలకు వినియోగించరు. చివరికి భక్తులు ముడుపు కట్టిన సొమ్ములు కూడా దేవునికి తప్ప మరే కార్యక్రమం కోసం వాడరు.
దేవునికి వచ్చే ఆదాయాన్ని ఆలయాల అభిృవద్ధికి, భక్తుల సౌకర్యాలకు, హిందూ ధర్మ ప్రచారానికి అర్చకులకు మాత్రమే వినియోగిస్తారు. కానీ.. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక ఆలయ ఆదాయంలో ఒక్క శాతం తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీనిపై ప్రతిపక్షాలతోపాటు భక్తుల నుంచి తీవ్ర నిరసన రావడం, విమర్శల వెల్లువతో ఏపీ సర్కార్ మనసు మార్చుకుంది. టీటీడీ ప్రతిపాదనను తిరస్కరిస్తూ.. ఈవోకు సమాచారం పంపింది ఏపీ దేవదాయశాఖ.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..