Vastu Tips: అన్ని ఉన్నా ఏదో ఆందోళనా.? ఈ వాస్తు టిప్స్ పాటించండి..
అందుకే ఇంట్లో ఇండే ప్రతీ వస్తువు వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉందో లేదో చూసుకుంటారు. ఇదిలా ఉంటే కొందరు నిత్యం ఏదో ఒక మానసిక ఆందోళనతో బాధపడుతుంటారు. చేతినిండా డబ్బులున్నా, చేయాల్సినంత పని ఉన్నా ఏదో లేని లోటు వీరిని వెంటాడుతుంటుంది. అయితే ఇలా ఉండడానికి కొన్ని వాస్తు దోషాలు కారణమని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే...
వాస్తు మనుషుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని విశ్వసించే వారు మనలో చాలా మంది ఉన్నారు. వాస్తును అధికంగా విశ్వసించే వారు మరీ ఎక్కువగా నమ్ముతుంటారు. ఇక వాస్తు శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. కేవలం ఇంటి నిర్మాణమే కాకుండా ఇంట్లో ఉండే వస్తువులు కూడా మనుషులపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అందుకే ఇంట్లో ఇండే ప్రతీ వస్తువు వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఉందో లేదో చూసుకుంటారు. ఇదిలా ఉంటే కొందరు నిత్యం ఏదో ఒక మానసిక ఆందోళనతో బాధపడుతుంటారు. చేతినిండా డబ్బులున్నా, చేయాల్సినంత పని ఉన్నా ఏదో లేని లోటు వీరిని వెంటాడుతుంటుంది. అయితే ఇలా ఉండడానికి కొన్ని వాస్తు దోషాలు కారణమని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి.? ఇప్పుడు చూద్దాం..
* ఇంట్లో కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఇంటి యజమాని బెడ్‌రూమ్ కచ్చితంగా నైరుతి దిశలోనే ఉండేలా చూసుకోవాలి. అలాగే తలను నిత్యం దక్షిణ దిశలో పెట్టి పడుకునేలా చూసుకోవాలి. ఉత్తర దిశలో కాళ్లు పెట్టుకొని పడుకుంటే ప్రతికూల ప్రభావం తగ్గుతుందని వాస్తు చెబుతోంది.
* ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా నిత్యం ఏదో తెలియని మానసిక ఆందోళన వెంటాడుతుంది. ఇలాంటి నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టాలంటే ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉత్తర దిశలో అక్వేరియం పెట్టుకోవడం వల్ల లాభిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల అలసట, ఒత్తిడి దూరమవుతుందని, మీలో కొత్త శక్తి ప్రసరిస్తుందని చెబుతున్నారు. ఇక అక్వేరియం ఎప్పుడూ బేసి సంఖ్యలో చేపలను ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
* వాస్తు శాస్త్రంలో అద్దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఒకవేళ అద్దం సరైన ప్రదేశంలో లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరీ ముఖ్యంగా బెడ్ రూమ్‌లో మంచం అద్దంలో కనిపించేలా ఉండకూడదని చెబుతున్నారు. ఇలా ఉంటే ఇంట్లో వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ బెడ్ రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్ లాంటివి ఉంటే అద్దాన్ని ఏదైనా గుడ్డతో కప్పాలని సూచిస్తున్నారు.
* ఇక ఇంట్లో చిన్నపిల్లల సీనరీలు ఉండేలా చేసుకోవాలి. ముఖ్యంగా నవ్వుతూ ఉన్న చిన్నారుల ఫొటోలు ఇంట్లో ఉంటే సానుకూల వాతవరణం పెరగడంతో పాటు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..