Abu-Dhabi’s Hindu Temple: అబుదాబిలో 27 ఎకరాల హిందూ దేవాలయం.. ప్రారంభానికి సర్వం సిద్ధం.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..?

Abu-Dhabi's Hindu Temple: యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశ రాజధాని అబుదాబిలో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద హిందూ దేవాలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నామని BAPS హిందూ మందిర్ తెలిపింది. మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం మొట్టమొదటి హిందూ..

Abu-Dhabi's Hindu Temple: అబుదాబిలో 27 ఎకరాల హిందూ దేవాలయం.. ప్రారంభానికి సర్వం సిద్ధం.. ప్రారంభోత్సవం ఎప్పుడంటే..?
Abu Dhabi's Hindu Temple
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Jul 20, 2023 | 12:58 PM

Abu-Dhabi’s Hindu Temple: యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశ రాజధాని అబుదాబిలో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద హిందూ దేవాలయాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించనున్నామని BAPS హిందూ మందిర్ తెలిపింది. మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం మొట్టమొదటి హిందూ రాతి దేవాలయం కావడం దీని ప్రత్యేకత. ఈ మేరకు యూఏఈలోని ఆలయ ప్రారంభోత్సవాన్ని అతిపెద్ద సామరస్య పండుగలా నిర్వహించనున్నామని హిందూ మందిర్ అధికార ప్రతినిథులు తెలిపారు. ఈ క్రమంలోనే  BAPS హిందూ మందిర్ ప్రపంచ సామరస్యానికి ఆధ్యాత్మిక ఒయాసిస్ అవుతుందని, ఈ ప్రారంభోత్సవ పండుగ భారత కళలు, విలువలు, సంస్కృతిని యూఏఈకి తీసుకొచ్చే వేడుక అవుతుందని ఆ దేశం పేర్కొంది.

అబు మురేఖాలో 27 ఎకరాల విస్తీర్ణంలో జీవం పోసుకుంటున్న ఈ హిందూ దేవాలయాన్ని పూజ్య మహంత్ స్వామి మహరాజ్ నేతృత్వంలో బీఏపీఎస్ ఆలయాన్ని 2024, ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నారు. ఈ వేడుక గొప్ప ఆధ్యాత్మికత, విశ్వాసం కలగలిసినది ఉండబోతుందని హిందూ మందిర్ ప్రతినిథులు పేర్కొన్నారు. ఆలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి పర్యవేక్షణలో ప్రాణం పోసుకుంటున్న ఈ ఆలయం వచ్చే ఫిబ్రవరి 18 నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే ఫిబ్రవరి 15న స్వామి మహరాజ్ సమక్షంలో ప్రజా సమర్పణ సభ జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు మందుగానే ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్‌సైట్‌కి వెళ్లి రిజస్ట్రేషన్ చేసుకోవలసి ఉంది.

కాగా, అబుదాబిలో హిందూ దేవాలయ నిర్మాణానికి అనుమతినిస్తూ యూఏఈ ప్రభుత్వం 2015 ఆగస్టులో భూమిని కేటాయించింది. ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు, రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ భూమిని బహుమానంగా BAPS(బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ)కి ఇచ్చారు. 2018 ఫిబ్రవరిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. పింక్ సాండ్‌స్టోన్‌తో నిర్మితమవుతున్న ఈ ఆలయం దాదాపు 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?