AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ నూతన గవర్నర్‌తో విజయసాయి రెడ్డి భేటీ

ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌తో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని విశ్వభూషణ్ నివాసానికెళ్లిన విజయసాయి రెడ్డి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విశ్వభూషణ్‌ను శాలువాతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు. కాగా ఈ నెల 24న విశ్వభూషణ్ ఏపీ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు తీసుకోనుండగా.. దీనికి సంబంధించిన […]

ఏపీ నూతన గవర్నర్‌తో విజయసాయి రెడ్డి భేటీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2019 | 9:44 AM

Share

ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌తో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని విశ్వభూషణ్ నివాసానికెళ్లిన విజయసాయి రెడ్డి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విశ్వభూషణ్‌ను శాలువాతో సత్కరించి, వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.

కాగా ఈ నెల 24న విశ్వభూషణ్ ఏపీ నూతన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ఆయన బాధ్యతలు తీసుకోనుండగా.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Follow Us