AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీలో ఉంది 23 మందా..? లేక నలుగురా..?

ఏపీ అసెంబ్లీలో టీడీపీ బలం 23.. ఇంత వరకు ఓ క్లారిటీ ఉంది కదా.. మరి చంద్రబాబు కాకుండా ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు ఉండాలి..? 22 మంది. కానీ.. ఇక్కడే లెక్క తేడా వస్తుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. చంద్రబాబుతో కలిపి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనా.. టీడీపీలో ఉంది..? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో సీరియస్‌గా సాగుతోందట. ఇందులో ఉన్న సెటైర్ ఫ్లేవర్‌ని పక్కన పెడితే.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు..? మిగిలిన ఎమ్మెల్యేలకు అసలేమైంది.. […]

టీడీపీలో ఉంది 23 మందా..? లేక నలుగురా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 20, 2019 | 11:14 AM

Share

ఏపీ అసెంబ్లీలో టీడీపీ బలం 23.. ఇంత వరకు ఓ క్లారిటీ ఉంది కదా.. మరి చంద్రబాబు కాకుండా ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు ఉండాలి..? 22 మంది. కానీ.. ఇక్కడే లెక్క తేడా వస్తుంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. చంద్రబాబుతో కలిపి నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమేనా.. టీడీపీలో ఉంది..? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో సీరియస్‌గా సాగుతోందట. ఇందులో ఉన్న సెటైర్ ఫ్లేవర్‌ని పక్కన పెడితే.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు..? మిగిలిన ఎమ్మెల్యేలకు అసలేమైంది.. అసలు ఈ 23, 4 అన్న లెక్క ఎందుకు మొదలైంది..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది టీడీపీ. పార్టీ చరిత్రలోనే లేనట్టు 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెల్చుకుంది. ఇదే తట్టుకోలేని స్థితిలో ఉన్న తెలుగు తమ్ముళ్లని.. చంద్రబాబుతో సహా నలుగురు ఎమ్మెల్యేనా టీడీపీకి అన్న చర్చ మరింత కలవరపెడుతోందట.

అసెంబ్లీలో అధికార పక్షం మీద దాడి చేసే క్రమంలో.. అధికార పక్షం చేస్తున్న దాడిని తిప్పికొట్టే క్రమంలో.. ఈ మ్ముగురు ఎమ్మెల్యేలు మాత్రమే దూకుడును ప్రదర్శిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయట. మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరూ గట్టిగా బాబుకు మద్దతు ప్రకటించడానికి గానీ, ఎదురుదాడి చేయడానికి గానీ ఆసక్తి చూడపం లేదన్న వార్త.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Follow Us