ఈసారి స్వాతంత్య్ర వేడుకలు అమరావతిలో కాదా? మరెక్కడ?

ఏపీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనబోతున్నారు వైఎస్ జగన్. ఆగష్టు 15 వేడుకల్లో సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరిస్తే చూడాలని వైసీపీ శ్రేణులు, పార్టీ అభిమానులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ ఈసారి ఏపీ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు వేదిక అమరావతి కాదట. సాగర తీరంలో ఈ వేడుకలను నిర్వహించాలనే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉందట. ఏపీ రాజధాని అమరావతి కాబట్టి.. సహజంగానే అమరావతిలోనే రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగాలి. […]

ఈసారి స్వాతంత్య్ర వేడుకలు అమరావతిలో కాదా? మరెక్కడ?
Follow us

| Edited By:

Updated on: Jul 20, 2019 | 9:52 AM

ఏపీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనబోతున్నారు వైఎస్ జగన్. ఆగష్టు 15 వేడుకల్లో సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరిస్తే చూడాలని వైసీపీ శ్రేణులు, పార్టీ అభిమానులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ ఈసారి ఏపీ ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు వేదిక అమరావతి కాదట. సాగర తీరంలో ఈ వేడుకలను నిర్వహించాలనే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉందట.

ఏపీ రాజధాని అమరావతి కాబట్టి.. సహజంగానే అమరావతిలోనే రాష్ట్ర ప్రభుత్వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగాలి. అయితే వైజాగ్‌లో ఆగష్టు 15 వేడుకలు నిర్వహించడం ద్వారా.. అభివృద్ధిలో ఏదో ఒక ప్రాంతానికే పరిమితం చేయమని, అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని సందేశం ఇవ్వాలన్నది ఏపీ ప్రభుత్వ ఉద్దేశమట. అమరావతి ఒక్కటే కాదు. ఏపీలోని అన్ని ప్రాంతాలు తమకు సమానమే.. ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయట.

ఇక స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి విశాఖ జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయట. సాధారణంగా విశాఖ సిటీలో పోలీస్ బ్యారెక్స్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆగష్టు 15 వేడుకలు జరిగితే భారీగా ప్రజలు హాజరవుతారు. అందుకే తగిన స్థలం కోసం జిల్లా అధికారులు సెర్చ్ చేస్తున్నారట. ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌ను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, భారీగా ప్రజలు సరిపోయేలా స్థలం కోసం చూస్తున్నారట.

గతంలో చంద్రబాబు కూడా ఒకసారి వైజాగ్‌లో ఆగష్టు 15 వేడుకలు నిర్వహించారు. సీఎం హోదాలో ఇప్పటికే రెండుసార్లు జగన్ వైజాగ్ వెళ్లారు. మరోవైపు కొన్ని నెలల్లోనే జీవీఎం ఎన్నికలున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తే.. పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహం నిండుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయట. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి పాలనపై తనదైన ముద్రను వేస్తోన్న జగన్.. ఆగష్టు 15 వేడుకల విషయంలోనూ అదే రీతిలో ఆలోచన చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి.