కమెడియన్ పృథ్వీకి బంపర్ ఆఫర్.. ఎస్వీబీసీ చైర్మన్‌గా ఖరారు!
తిరుపతి: శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ప్రముఖ హాస్యనటుడు పృథ్విరాజ్‌ను నియమిస్తూ.. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీని ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమించారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్.. పార్టీ కోసం పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తున్నారు. ఇక టీడీపీ హయాంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నియమితులయ్యారు. తాజాగా ఆయన రాజీనామా చేశారు. ఈ […]

తిరుపతి: శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా ప్రముఖ హాస్యనటుడు పృథ్విరాజ్‌ను నియమిస్తూ.. ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీని ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమించారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్.. పార్టీ కోసం పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తున్నారు.
ఇక టీడీపీ హయాంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నియమితులయ్యారు. తాజాగా ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పదవిని ఫృథ్వీరాజ్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.




