బ్రిటీష్ టీనేజర్ హత్యాచారం కేసు: దోషిగా తేలిన నిర్దోషి

బ్రిటన్‌కు చెందిన టీనేజర్ స్కార్లెట్ ఎడెన్ కీలింగ్ హత్య కేసులో గోవా హైకోర్టు ఒకరిని దోషిగా తేల్చింది. ఈ కేసులో ఇద్దరిని గోవా చిల్ట్రన్ కోర్టు గత ఏడాది నిర్దోషులుగా తేల్చగా.. ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కేసును విచారించిన హైకోర్టు వారిలో ఒకరిని దోషిగా పేర్కొంటూ.. పదేళ్లు కఠిన కారాగార శిక్ష అమలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. స్కార్లెట్ 2008 ఫిబ్రవరి 18న గోవాలోని అంజునా బీచ్‌లో తీవ్ర గాయాలతో హత్యాచారానికి గురైంది. ఈ […]

బ్రిటీష్ టీనేజర్ హత్యాచారం కేసు: దోషిగా తేలిన నిర్దోషి
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2019 | 6:43 PM

బ్రిటన్‌కు చెందిన టీనేజర్ స్కార్లెట్ ఎడెన్ కీలింగ్ హత్య కేసులో గోవా హైకోర్టు ఒకరిని దోషిగా తేల్చింది. ఈ కేసులో ఇద్దరిని గోవా చిల్ట్రన్ కోర్టు గత ఏడాది నిర్దోషులుగా తేల్చగా.. ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించింది. దీంతో కేసును విచారించిన హైకోర్టు వారిలో ఒకరిని దోషిగా పేర్కొంటూ.. పదేళ్లు కఠిన కారాగార శిక్ష అమలు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. స్కార్లెట్ 2008 ఫిబ్రవరి 18న గోవాలోని అంజునా బీచ్‌లో తీవ్ర గాయాలతో హత్యాచారానికి గురైంది. ఈ కేసులో బీచ్ షాక్ వర్కర్(బీచ్‌లో ఉండే చిన్న చిన్న కుటీరాల్లో పనిచేసే వారు)గా పనిచేస్తోన్న సామ్సన్ డిసౌజా, మరో వ్యక్తి ప్లాసిడో కార్వల్హోను నిందితులుగా పోలీసులు జత చేర్చారు. ఇక ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన గోవా చిల్డ్రన్ కోర్టు.. వారిద్దరి నిర్దోషులుగా పేర్కొంది. అయితే ఈ తీర్పుపై స్కార్లెట్ తల్లి హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా దీన్ని విచారించిన హైకోర్టు ఐపీసీ సెక్షన్ 328, 354, 304, 201, 8(2)ల కింద డిసౌజాను దోషిగా తేల్చింది. ఇతడికి పదేళ్లు కఠిన కారాగార శిక్షను అమలు చేసింది. మరో నిందితుడు కార్వాల్హోను నిర్దోషిగా విడుదల చేసింది.