ముగిసిన రెండో డెడ్‌లైన్.. సుప్రీం మెట్లెక్కిన కుమారస్వామి..

కర్ణాటకలో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. బల పరీక్షకు గవర్నర్ ఇచ్చిన రెండో గడువు కూడా శుక్రవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అంతకు ముందు గవర్నర్ ఇచ్చిన తొలి గడువు మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. విశ్వాస తీర్మానంపై చర్చ లేకుండా ఓటింగ్‌కు వెళ్లలేమని స్పీకర్ తేల్చి చెప్పడంతో.. తొలి గడువు ముగిసింది. అయితే అనూహ్యంగా గవర్నర్ సాయంత్రానికి రెండో గడువు ప్రకటిస్తూ సీఎంకు లేఖ రాయడం ఆసక్తి రేపింది. దీనిపై కుమారస్వామి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం […]

ముగిసిన రెండో డెడ్‌లైన్.. సుప్రీం మెట్లెక్కిన కుమారస్వామి..
Follow us

| Edited By:

Updated on: Jul 19, 2019 | 8:13 PM

కర్ణాటకలో హైడ్రామా ఇంకా కొనసాగుతోంది. బల పరీక్షకు గవర్నర్ ఇచ్చిన రెండో గడువు కూడా శుక్రవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. అంతకు ముందు గవర్నర్ ఇచ్చిన తొలి గడువు మధ్యాహ్నం 1.30 గంటలకు ముగిసింది. విశ్వాస తీర్మానంపై చర్చ లేకుండా ఓటింగ్‌కు వెళ్లలేమని స్పీకర్ తేల్చి చెప్పడంతో.. తొలి గడువు ముగిసింది. అయితే అనూహ్యంగా గవర్నర్ సాయంత్రానికి రెండో గడువు ప్రకటిస్తూ సీఎంకు లేఖ రాయడం ఆసక్తి రేపింది. దీనిపై కుమారస్వామి అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేస్తూ గవర్నర్ రెండో లేఖ తనను బాధించిందని, ఇక నిర్ణయం, తనను రక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌ నిర్ణయానికే వదిలిపెడుతున్నానని అన్నారు.

కాగా విశ్వాస పరీక్షపై గవర్నర్ జోక్యంపై కుమారస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్ పదే పదే డెడ్‌లైన్లు విధించడం సరికాదంటూ ఆయన సుప్రీం కోర్టులో ఫిటిషన్ వేశారు.