ఇదెక్కడి ‘మోసం’ ? పేదోళ్ల నోట్లో ‘మట్టి ‘ ! ఈ యాడ్ వైనం చూడాల్సిందే ! అంతా ‘మాయాజాలం..!!

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తున్నామని మోదీ ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ పథకం కింద బెంగాల్ లో ఓ పేద మహిళ చక్కని ఇంటి సౌకర్యాన్ని పొందిందని అంటూ ప్రధాని మోదీ ఫొటోతో కూడిన యాడ్ ని డైలీలు ప్రచురించాయి. '

ఇదెక్కడి 'మోసం' ? పేదోళ్ల నోట్లో 'మట్టి ' !  ఈ యాడ్ వైనం చూడాల్సిందే ! అంతా 'మాయాజాలం..!!
Kolkata Woman Seen In Housing Ad With Pm Modi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 22, 2021 | 7:21 PM

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో పేదలకు ఇళ్ళు నిర్మించి ఇస్తున్నామని మోదీ ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ పథకం కింద బెంగాల్ లో ఓ పేద మహిళ చక్కని ఇంటి సౌకర్యాన్ని పొందిందని అంటూ ప్రధాని మోదీ ఫొటోతో కూడిన యాడ్ ని డైలీలు ప్రచురించాయి. ‘ ఆత్మ నిర్భర్ భారత్, ఆత్మ నిర్భర్ బెంగాల్’ అనే టైటిల్ తో గల ఈ  యాడ్ ని చూస్తే నిజమే కాబోలనుకుంటాం.  బెంగాల్ లో ఇప్పటివరకు ఇలా 24 లక్షల ఇళ్ళు నిర్మించి ఇ చ్చారన్నది ఈ యాడ్ కాన్సెప్ట్..  పైగా ఈ ఫొటోలో ఉన్న మహిళ..తనకు ఇంత మంచి ఇల్లు ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు  చెబుతున్నట్టు కూడా ఇందులో ఉంది.  కానీ ఇక్కడ ఓ  తిరకాసు.. ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు లక్ష్జ్మీదేవి అట.. ఈమె కోల్ కతా లో ఓ దాదాపు మురికివాడ వంటి ప్రాంతంలో పూరిళ్ల మధ్య నివసిస్తోంది.తాను నెలకు ఈ ఇంటికి 500 రూపాయల అద్దె చెల్లిస్తున్నానని, ఇల్లు చిన్నదైనందున తమ పిల్లలు ఇంట్లో పడుకుంటే తాము బయట ఫుట్ పాత్ పై పడుకుంటామని ఆమె తెలిపింది. తమకు ఏ ప్రభుత్వ పథకం గురించి కూడా తెలియదని చెప్పింది. నగరంలో ఒకచోట తను టాయిలెట్లు కడుగుతుంటానని. కానీ తనకు తెలియకుండా ఎవరో, ఎప్పుడు ఈ ఫోటో తీసుకున్నారో తెలియదని లక్ష్మీదేవి చెప్పింది.

మాకసలు సొంత ఇల్లే లేదు.. అలాంటిది ఈ  యాడ్ లో ఇలా ఇల్లు ఉన్నట్టు చూపడమేమిటని ఆ అమాయకురాలు ఆశ్చర్యపోయింది.ఈ విధమైన యాడ్ లు ప్రజలను పక్కదారి పట్టించడానికే అని కాంగ్రెస్ వంటి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంకా  ఇలాంటి పేద మహిళల ఫోటోలను  బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్నవారు ఎన్ని తీశారో అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి: KTR vs Piyush Goyal : ‘మా సంగతేంటి సారూ’.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ వీడియోకి మంత్రి కేటీఆర్ రియాక్షన్

Heat Wave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్..