Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat Wave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్..

Andhra Pradesh State Disaster Management: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజూకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుండటంతో ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. దాదాపు

Heat Wave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్..
Andhra Pradesh Heat Wave Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 22, 2021 | 6:50 PM

Andhra Pradesh State Disaster Management: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజూకు ఎండల తీవ్రత భారీగా పెరుగుతుండటంతో ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. దాదాపు నిత్యం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రజలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ హెచ్చరికలు చేస్తోంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయని.. వడగాల్పుల ప్రమాదం కూడా పొంచిఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు పలు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రజలకు సూచనలు చేసింది.

ఏపీలో మొత్తం 670 మండలాలు ఉండగా.. ఈ రోజు 19మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉన్నట్లు విపత్తుల శాఖ పేర్కొంది. ఈ మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయని వెల్లడించింది. అత్యధికంగా తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. రాగల 48 గంటల్లో 48 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని సూచనలు చేసింది. అయితే కొన్ని చోట్ల ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఎండలకు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది.

మండలాల వారీగా వివరాలను ఈ కింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి

Heat Wave

Heat Wave

Heat wave Telugu 22032021

Also Read:

అతి తక్కువ ధరలకే కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, కిరాణా సరుకులు.. సరికొత్త పోర్టల్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం..