AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతి తక్కువ ధరలకే కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, కిరాణా సరుకులు.. సరికొత్త పోర్టల్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం..

G-Cart Portal: ఇంట్లోకి కావాల్సిన వస్తువులు.. మార్కెట్‏లో కంటే అతి తక్కువ ధరకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్

అతి తక్కువ ధరలకే కంప్యూటర్స్, స్మార్ట్ ఫోన్స్, కిరాణా సరుకులు.. సరికొత్త పోర్టల్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం..
Online Groceries Portal
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2021 | 5:30 PM

Share

G-Cart Portal: ఇంట్లోకి కావాల్సిన వస్తువులు.. మార్కెట్‏లో కంటే అతి తక్కువ ధరకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందులో కంప్యూటర్లు, ట్యాబ్‏లు, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను రాయితీ ధరలకు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (APTS) అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మాదిరిగానే.. జీ-కార్ట్ అనే పోర్టల్‏ను అభివృద్ధి చేస్తోంది. ఉద్యోగులు తమ ఐడి నంబరుతో ఈ పోర్టల్‏లోకి లాగిన్ అయి.. వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఈ పోర్టల్ ప్రయోగదశలో ఉంది. సెక్యూరిటీ చెకింగ్ పూర్తయిన తర్వాత ఈ పోర్టల్ అందుబాటులోకి రానుంది.

ఈ పోర్టల్‏ను తర్వలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు ఏపీటీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్ తెలిపారు. దీని ద్వారా దాదాపు 10.36 లక్షల ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఏపీటీఎస్ అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ సంస్థలతో సహా 7,76,492 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ-కామర్స్ పోర్టల్స్‏లో ఉన్నవాటి కంటే.. ఇందులో తక్కువ ధరకే సరుకులను సరఫరాల చేయడానికి తయారీదారులతో చర్చలు జరుపుతున్నామని నందకిషోర్ తెలిపారు. పది లక్షల మంది ఉద్యోగులతో సైన్అప్ కావడానికి ఒరిజినల్ ఈక్విప్‏మెంట్ మ్యానుఫాక్చరింగ్ (OME) సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక కొంతమంది ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి.. ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే.. ఎక్కువగా డిస్కౌంట్స్ ఇచ్చేందుకు గ్రూప్ బైయింగ్ పాలసీ విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కింద దుకాణాలను ఏర్పాటు చేసిన మహిళలకు అతి తక్కువ ధరలకే వస్తువులను సరఫరా చేసేందుకు హోల్‏సేల్ రిటైలర్లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. వాల్ మార్ట్, డీమార్ట్, రిలయన్స్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. ఇదే విషయంపై కృష్ణ జిల్లాలో ఈ ప్రయోగం జరుగుతున్నట్లుగా ఏపీటీఎస్ నంద కిషోర్ తెలిపారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ చేయూత పథకం కింద్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75వేల మంది దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారని.. ఈ పోర్టల్ కోసం సరుకులను నేరుగా దుకాణాలకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకోచ్చారు.

Also Read:

మీ సమీపంలోని పెట్రోల్, డీజిల్ రేట్లను ఒక్క SMSతో తెలుసుకోవచ్చు… ఎలానో తెలుసా..

ఆర్టీవో కొత్త నిబంధనలు.. డ్రైవింగ్ లైసెన్స్‌తో సహ 18 పనులు ఇంటి నుంచే.. అవేంటో తెలుసుకోండి..