మీ సమీపంలోని పెట్రోల్, డీజిల్ రేట్లను ఒక్క SMSతో తెలుసుకోవచ్చు… ఎలానో తెలుసా..
Petrol Diesel Prices Today: ఇటీవల కాలంలో పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ.. వాహనాదారులకు

Petrol Diesel Prices Today: ఇటీవల కాలంలో పెట్రోల్, డిజిల్ ధరలు గణనీయంగా పెరుగుతూ.. వాహనాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో తమ వినియోగదారులకు తాజా ఇందన్ రేట్లను తెలియజేయడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. స్టేట్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) ఒక ఎస్ఎంఎస్ సదుపాయాన్ని అందిస్తుంది. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వినియోగదారులకు వారి మొబైల్లోనే ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డిజిల్ రేట్లను తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సేవలను పొందటానికి కస్టమర్ ఒక నిర్ధిష్ట సంఖ్యకు కంపెనీ సూచించిన ఫార్మాట్లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.
ఎస్ఎంఎస్ ఎలా పంపాలో తెలుసుకుందాం..
ఇండియన్ ఆయిల్ సంస్థ యొక్క ఇందన రిటైలర్స్ అధికారిక వెబ్సైట్ iocl.comను సందర్శించాలి. RSP<Space> పెట్రోల్ పంప్ డీలర్ కోడ్ ఎంటర్ చేసి 9224992249 కు SMS పంపాలి. ఎస్ఎంఎస్ పంపిన తర్వాత ఇండియన్ ఆయిల్ సంస్థ.. మీకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తుంది. అయితే ఒక్కో నగరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వాటి వివరాలను ఇండియన్ ఆయిల్ తన వెబ్సైట్లో పొందుపర్చింది. దాదాపు 41 నగరాల్లో ఉన్న పెట్రోల్ పంప్ డీలర్ కోడ్ల జాబితాను క్రియేట్ చేసింది.
పెట్రోల్, డీజిల్ ధరలను ప్రస్తుతం చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం ప్రతిరోజు సమీక్షిస్తాయి. అలాగే ఇంధన స్టేషన్లలో ఏవైనా మార్పులు చేసిన అవి ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి.
మీ సిటీలో పెట్రోల్ ధరలు చూడండి: https://tv9telugu.com/business/petrol-price-today.html
మీ సిటీలో డిజీల్ ధరలు చూడండి: https://tv9telugu.com/business/diesel-price-today.html
Also Read: ఆర్టీవో కొత్త నిబంధనలు.. డ్రైవింగ్ లైసెన్స్‌తో సహ 18 పనులు ఇంటి నుంచే.. అవేంటో తెలుసుకోండి..
Smart Gadgets: ఈ గ్యాడ్జెట్స్‌తో మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చేసుకోండి.. ధర కూడా తక్కువే..