- Telugu News Photo Gallery Technology photos Home based smart gadgets under low price smart light smart plug and specifications
Smart Gadgets: ఈ గ్యాడ్జెట్స్‌తో మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చేసుకోండి.. ధర కూడా తక్కువే..
Smart Gadgets: ఈ స్మార్ట్ యుగంలో అన్ని వస్తువులు స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఒకప్పుడు సాధారణంగా ఉన్న వస్తువులు కూడా ఇప్పుడు స్మార్ట్ రంగును పులుముకుంటున్నాయి. ఈ క్రమంలోనే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్ వివరాలు...
Updated on: Mar 22, 2021 | 8:19 AM

ప్రస్తుతం అంతా స్మార్ట్ మయమవుతోంది. ఫోన్ నుంచి వాచ్ వరకు.. టీవీ నుంచి ఫ్రిడ్జ్ వరకు అన్ని గ్యాడ్జెట్స్ స్మార్ట్ రంగును పులుముకుంటున్నాయి.

ఈ క్రమంలో ఇంట్లో ఉపయోగించే చిన్న చిన్న గ్యాడ్జెట్లు కూడా స్మార్ట్‌గా మారి వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

మార్కెట్లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ గ్యాడ్జెట్ల వివరాలు ఇప్పుడు చూద్దాం..

Mi Motion Activated Night Light 2: ఈ స్మార్ట్ లైట్ తనకు సమీపంలో 120 డిగ్రీల పరిధిలో వ్యక్తుల కదలికలను గుర్తించి వెలుగుతుంది. ఒకవేళ ఎవరూ లేకపోతే ఆఫ్ అవుతుంది. దీని ధర రూ.599.

TP-Link HS100 WiFi- Smart Plug: ఈ ప్లగ్‌కు అనుసంధానించిన వస్తువులను అమేజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. దీని ధర రూ.1599

Automatic Soap Dispenser: ఈ స్మార్ట్ గ్యాడ్జెట్‌తో టచ్ చేయకుండానే శానిటైజర్‌ను చేతులోకి తీసుకోవచ్చు. దీని ధర రూ.1499





























