రేపటి ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి
రేపు జరగనున్న తెలుగురాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపైనే ప్రధానంగా చర్చ సాగనుంది. ఇదే ప్రధాన ఎజెండాగా ఇరువురు సీఎంలు రెండు రోజుల పాటు చర్చించనున్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత పలు సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. అయితే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సఖ్యతగా లేకపోవడంతో […]
రేపు జరగనున్న తెలుగురాష్ట్రాల సీఎంల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపైనే ప్రధానంగా చర్చ సాగనుంది. ఇదే ప్రధాన ఎజెండాగా ఇరువురు సీఎంలు రెండు రోజుల పాటు చర్చించనున్నారు.
రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత పలు సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. అయితే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సఖ్యతగా లేకపోవడంతో సమస్యలు అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా జలవివాదాలు పరిష్కారం కాలేదు. గోదావరిని కృష్ణా బేసిన్‌కు తరలించడం,9,10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన,విద్యుత్ బకాయిల వివాదాలు,ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన,సొంత రాష్ట్రాలకు ఉద్యోగుల్ని తీసుకురావడం వంటి ఆరు ప్రధాన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
పొరుగు రాష్ట్రాలలో స్నేహపూర్వకంగా ఉంటామని ముందే చెప్పిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర ప్రభుత్వంతో అదే విధానాన్ని కొనసాగించి ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారం చేసుకోగలిగారు. అదే విధంగా ఏపీతో కూడా అదే పద్ధతిలో అవలంబిస్తూ తెలంగాణకు రావాల్సిన వాటిని దక్కించుకునే పనిలో ఉన్నారు. రేపు జరగనున్న చర్చలతో దాదాపుగా ఒక పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదిలాఉంటే రేపటి సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు.