మీ కడుపు చల్లగుండా.. కివీ నీళ్లూ తాగండి!

31 May 2026

TV9 Telugu

TV9 Telugu

సపోటా, ద్రాక్ష, కమలా.. ఇలా ఆయా కాలాల్లో దొరికే పండ్లు నానబెట్టిన నీళ్ల గురించి తెలుసుకుంటున్నాం కదా! ఈసారి కివీ వాటర్‌ ఆరోగ్యపరంగా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం

TV9 Telugu

నాలుగు కివీ పండ్లను చెక్కు తీసి, స్లైసులు చేసి.. లీటరు నీళ్లలో వేయాలి. కొన్ని ముక్కలు గుజ్జు చేసి వేస్తే మరింత రుచిగా ఉంటుంది. అందులో కొన్ని పుదీనా ఆకులను నలిపి వేయాలి. ఓ గంట తర్వాత వాటిని తీసేసి నీళ్లు తాగొచ్చు

TV9 Telugu

మరీ పచ్చివీ లేదా మిగలపండినవీ కాకుండా పక్వానికి వచ్చిన కివీ పండ్లను ఎంచుకోవాలి. వీటిని రాత్రి ఫ్రిజ్‌లో ఉంచి, ఉదయం ఉపయోగించాలి

TV9 Telugu

ఈ నీటి వల్ల.. అరుగుదల బాగుంటుంది. అజీర్తి, ఆకలి మందగించటం లాంటి సమస్యలు రావు. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. మలబద్దకం కూడా తగ్గుతుంది

TV9 Telugu

రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో చేరిన విషపదార్థాలు హరిస్తాయి. శక్తి చేకూరుతుంది, నిస్సత్తువ ఉండదు

TV9 Telugu

రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది. గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. నీ కంటిచూపు మెరుగవుతుంది. ఎముకలకు పటుత్వం చేకూరుతుంది. ఈ నీరు రుచిగా ఉంటుంది కనుక పిల్లలతో ఎక్కువ తాగించవచ్చు

TV9 Telugu

సపోటా మాదిరిగా ఉండే కివి పండు న్యూజిలాండ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని నేరుగా కూడా తినవచ్చు. రుచికి ఇవి తియ్యగా, పుల్లగా ఉంటాయి

TV9 Telugu

కివీలోని విటమిన్‌ - సి, యాంటీ ఆక్సిడెంట్లూ ఆస్తమా ఉన్నవారిలో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటు స్థాయులను తగ్గించడంలో సాయపడుతుంది