గంటాతో తోట త్రిమూర్తులు భేటీ
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ చుట్టూనే రాజకీయం అంతా నడుస్తోంది. ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్‌లో బలమైన శక్తిగా ఉన్న టీడీపీ..ఫలితాల అనంతరం ఘోర పరాజయంతో కోలుకోలేకపోతోంది. ఆ పార్టీ నేతలు ఒకరి వెంట ఒకరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం మొదలైంది. మరోవైపు పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలందరూ గంపగుత్తగా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరందరూ ప్రత్యేక సమావేశం అవ్వడం చర్చనీయాంశమైంది. తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌తో […]
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ చుట్టూనే రాజకీయం అంతా నడుస్తోంది. ఎన్నికల ముందు వరకు ఆంధ్రప్రదేశ్‌లో బలమైన శక్తిగా ఉన్న టీడీపీ..ఫలితాల అనంతరం ఘోర పరాజయంతో కోలుకోలేకపోతోంది. ఆ పార్టీ నేతలు ఒకరి వెంట ఒకరు బీజేపీ తీర్థం పుచ్చుకుంటుండటంతో పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం మొదలైంది. మరోవైపు పార్టీలోని కాపు సామాజికవర్గ నేతలందరూ గంపగుత్తగా పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరందరూ ప్రత్యేక సమావేశం అవ్వడం చర్చనీయాంశమైంది.
తాజాగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌తో పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తోన్న తోట త్రిమూర్తులు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కాకినాడలో జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశానికి త్రిమూర్తులు పెద్దగా వ్యవహరించారు. ఆ తర్వాత జరిగిన టీడీపీ నాయకులతో అధినేత జరిపిన సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. మరోవైపు తోట త్రిమూర్తులుతో జరిగిన సమావేశంలో పాల్గొన్న కాపు నాయకులు శుక్రవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. దీంతో ఈ ఇద్దరి నేతల భేటీ ఉత్కంఠ రేపుతోంది.