విజయనిర్మల రాజకీయ ప్రస్థానం
కైకలూరు నుంచే సినీనటి విజయనిర్మల రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆమె మరణవార్త విని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి తానే స్వయంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను చూసి ఆమె చలించిపోయారు. కాగా ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగడంతో 1,102 ఓట్ల తేడాతో విజయనిర్మల ఓటమి పాలయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి నంబూరి వెంకటరామరాజు […]
కైకలూరు నుంచే సినీనటి విజయనిర్మల రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆమె మరణవార్త విని అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి గ్రామాన్ని సందర్శించి తానే స్వయంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను చూసి ఆమె చలించిపోయారు. కాగా ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగడంతో 1,102 ఓట్ల తేడాతో విజయనిర్మల ఓటమి పాలయ్యారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి నంబూరి వెంకటరామరాజు పోటీ చేయగా.. టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్నేని రాజారామచందర్ గెలుపొందారు. ఇక విజయనిర్మల రెండో స్థానాన్ని కైవశం చేసుకున్నారు.
1989లో పార్లమెంట్ అభ్యర్థిగా ఘట్టమనేని కృష్ణ పోటీ చేసిన సమయంలో కూడా కైకలూరులో విజయనిర్మల ఎన్నికల ప్రచారం చేశారు. ప్రజా సమస్యలను దగ్గరగా చూసి చలించిపోయిన ఆమె, ప్రజా సమస్యలను పరిష్కరించి, కోల్లేరు ప్రజలకు జీవనోపాధిని కల్పించాలని అనుకునేవారు. అందుకే ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరిగేవారని, ఓటమి చెందినప్పటికీ తరువాత కాలంలో కైకలూరు సమస్యలపై ఆరా తీశారని ఆవిడ సన్నిహితులు చెబుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొల్లేరు సరస్సు అంటే ఆమెకు ఎనలేని మక్కువ అని తెలిపారు.