AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌.. వాహనసేవల వివరాలు ఇవే..

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు అయింది. కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 13 నుండి..

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌.. వాహనసేవల వివరాలు ఇవే..
Kodanda Ramaswamy Brahmoths
K Sammaiah
|

Updated on: Mar 13, 2021 | 12:44 PM

Share

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారు అయింది. కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 13 నుండి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జ‌రుగ‌నున్నాయని టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, మేదినిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

మార్చి 13న ధ్వ‌జారోహ‌ణం

శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల‌కు మార్చి 13న శ‌నివారం ఉద‌యం 8 నుండి 8.10 గంట‌ల మ‌ధ్య మేష ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంది. బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌రకు, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ జి.రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ                                             ఉదయం                         సాయంత్రం

13-03-21 (శనివారం)               ధ్వజారోహణం                 పెద్దశేష వాహనం

14-03-21(ఆదివారం)              చిన్నశేష వాహనం          హంస వాహనం

15-03-21(సోమవారం)             సింహ వాహనం               ముత్యపుపందిరి వాహనం

16-03-21(మంగళవారం)        కల్పవృక్ష వాహనం         సర్వభూపాల వాహనం

17-03-21(బుధవారం)             పల్లకీ ఉత్సవం                గరుడ వాహనం

18-03-21(గురువారం)             హనుమంత వాహనం      వసంతోత్సవం/గజ వాహనం

19-03-21(శుక్రవారం)              సూర్యప్రభ వాహనం         చంద్రప్రభ వాహనం

20-03-21(శనివారం)              సర్వభూపాల వాహనం      అశ్వవాహనం

21-03-21(ఆదివారం)             చక్రస్నానం                        ధ్వజావరోహణం

Read More:

వేద పాఠశాలను తనిఖీ చేసిన వైవీ సుబ్బారెడ్డి.. మూడు రోజుల క్రితం 57 మంది విద్యార్థులకు సోకిన కరోనా

సానుభూతి రాజకీయాలతో లాభం లేదు.. దమ్ముంటే స్వచ్ఛమైన రాజకీయాలు చెయాలి -మంత్రి పేర్నినాని

అట్టుడుకుతున్న ఉక్కునగరం.. గుంటూరు నుంచి విశాఖకు పాదయాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ

ఆ విషయంలో కేంద్ర నిర్ణయం సబబే.. జగన్‌, చంద్రబాబుకు అన్నీ తెలుసు.. రాజకీయ లబ్దికోసమే రాద్దాతమంటున్న బీజేపీ

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!