సానుభూతి రాజకీయాలతో లాభం లేదు.. దమ్ముంటే స్వచ్ఛమైన రాజకీయాలు చెయాలి -మంత్రి పేర్నినాని

తెలుగుదేశం పార్టీపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సానుభూతి రాజకీయాలు కాదు స్వచ్ఛమైన రాజకీయాలు చెయాలని పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్..

సానుభూతి రాజకీయాలతో లాభం లేదు.. దమ్ముంటే స్వచ్ఛమైన రాజకీయాలు చెయాలి -మంత్రి పేర్నినాని
Minister Perni Nani Fires O
Follow us

|

Updated on: Mar 13, 2021 | 12:25 PM

తెలుగుదేశం పార్టీపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. సానుభూతి రాజకీయాలు కాదు స్వచ్ఛమైన రాజకీయాలు చెయాలని పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పేర్ని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హత్యా రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేస్తే కేసులు పెట్టరా అని మంత్రి ప్రేశ్నించారు.

అక్రమ కేసులు పెట్టారని కొల్లు రవీంద్ర మాట్లాడటాన్ని మంత్రి పేర్ని నాని ఖండించారు. ఎ కేసు అక్రమంగా పెట్టారో చెప్పాలని నాని ప్రేశ్నించారు. మీపైన ఉన్నది రాస్తారోకో కేసు, కోవిద్ సెంటర్లోకి అక్రమంగా ప్రవేశించిన కేసు, మోకా భాస్కరరావు హత్య కేసు ఇవన్ని కేసులను పెట్టింది పోలీసులే నన్నారు. మరి వీటిలో అక్రమ కేసులు ఏవి? ఇక్కడ కూడా సానుభూతి నీచ రాజకేయాలేనా అని నాని ధ్వజమెత్తారు.

రౌడీయిజమ్ చేసి కేసులు కట్టించుకుని గెలుపుకోసం సానుభూతి పొందటానికి ఇంతగా దిగజారాలా అని మంత్రి పేర్ని నాని టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఎం.ఎల్.ఎ గా మళ్ళీ గెలవటానికి ఇంతగా దిగజారాలా అన్నారు. తప్పులన్నీ చేసేసి, రౌడీయిజం చేసేసి బురదంతా నాని మీద, సీఎం జగన్ ప్రభుత్వం మీద వేసేసి సమ్మగా ఉందామనుకుంటున్నారని నాని ధ్వజమెత్తారు.

కాపుల మహిళా అభ్యర్థిని మేయరుగా నారా లోకేష్ ప్రకటించడంతో పేర్ని నానికి వణుకు పుట్టిందని మరొక టీడీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు. ప్రజలు అమాయకులని వీళ్ళు అనుకుంటున్నారా? అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు టీడీపీకి వార్డులలో నిలబెట్టానికి అభ్యర్థులే దొరకని దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఎలా మీకు మేయర్ పదవి వస్తుందో నాకు అర్థకావటం లేదని మంత్రి ఎద్దేవా చేశారు.

దొరికిన వాడిని దొరికినట్టు కండువా వేసేసి అభ్యర్థిగా నిలబెట్టిన మీమల్ని చూసి నేను వణికిపోవడం హాస్యాస్పదంగా ఉందనారు మంత్రి. నామీద తప్పుడు కేసులు పెట్టారని సానుభూతి రహకీయాలు వదిలిపెట్టి, స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని కొల్లు రవీంద్రకు సూచించాలని మాజీ ఎం.పి కొనకళ్ళ నారాయణరావుని కోరారు. మొత్తానికి మంత్రి, మాజీ మంత్రి మధ్య కామెంట్స్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తిగా మారాయి.

Read More:

వేద పాఠశాలను తనిఖీ చేసిన వైవీ సుబ్బారెడ్డి.. మూడు రోజుల క్రితం 57 మంది విద్యార్థులకు సోకిన కరోనా

అట్టుడుకుతున్న ఉక్కునగరం.. గుంటూరు నుంచి విశాఖకు పాదయాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ

ఆ విషయంలో కేంద్ర నిర్ణయం సబబే.. జగన్‌, చంద్రబాబుకు అన్నీ తెలుసు.. రాజకీయ లబ్దికోసమే రాద్దాతమంటున్న బీజేపీ

Latest Articles