వేద పాఠశాలను తనిఖీ చేసిన వైవీ సుబ్బారెడ్డి.. మూడు రోజుల క్రితం 57 మంది విద్యార్థులకు సోకిన కరోనా

వేద పాఠశాలలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా తిరుమల ధర్మగిరి వేద పాఠశాలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి..

వేద పాఠశాలను తనిఖీ చేసిన వైవీ సుబ్బారెడ్డి.. మూడు రోజుల క్రితం 57 మంది విద్యార్థులకు సోకిన కరోనా
Ttd Chairman Inspection In
Follow us
K Sammaiah

|

Updated on: Mar 13, 2021 | 1:38 PM

వేద పాఠశాలలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా తిరుమల ధర్మగిరి వేద పాఠశాలను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. కొందరు విద్యార్థులకు కోవిడ్ సోకిన నేపథ్యంలో ఆయన పాఠశాల లోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు కరోనా బారిన పడటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వేద పాఠశాలకు చెందిన 57 మంది విద్యార్థులు, ఒక అధ్యాపకుడికి కోవిడ్ సోకిందని, ఎవరికీ లక్షణాలు కనిపించలేదని అధికారులు చైర్మన్ కు తెలిపారు. వేద పాఠశాలలోని భోజనశాలలు, వంటశాల, విద్యార్థుల వసతి గృహాలు, తరగతి గదులు చైర్మన్ పరిశీలించారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు మాత్రమే వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ 19 నిబంధనల మేరకు విద్యార్థులు, అధ్యాపకులకు వసతి కల్పించడానికి అవసరమైతే అదనపు గదులు కేటాయించాలని ఎస్టేట్ ఆఫీసర్ విజయ సారథిని సుబ్బారెడ్డి ఆదేశించారు.

విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు నిరంతరం అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ సూచించారు. నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, మరుగుదొడ్లు, స్నానాల గదులు తరచూ శుభ్రం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. డైనింగ్ హాల్ లో 2 మీటర్ల దూరంలో విద్యార్థులను కూర్చోబెట్టాలన్నారు. పరిస్థితులు మామూలు స్థాయికి వచ్చే దాకా డాక్టర్, వైద్య సిబ్బందిని రేయింబవళ్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్యాధికారి డాక్టర్ ఆర్ ఆర్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నర్మద, వేద పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ కుప్పా శివ సుబ్రమణ్య అవధాని పాల్గొన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వేద పాఠశాలలో కోవిడ్ సోకిన విద్యార్థులందరికీ ఎలాంటి ఇబ్బంది లేదని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అందరికీ మెరుగైన చికిత్స జరుగుతోందన్నారు.

57 మంది విద్యార్థులకు సోకిన కరోనా మూడు రోజుల క్రితం తిరుమల వేద పాఠశాలలో 57 మంది విద్యార్థులు కరోనా బారిన పడటం స్థానికంగా కలకలం రేపింది. ఐదు రోజుల క్రితం ధర్మగిరి వేద పాఠ‌శాల‌లో మొత్తం 435 మంది విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యారు. వీరంద‌రూ త‌మ స్వస్థలాల్లో కొవిడ్ ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్షలు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు స‌మ‌ర్పించారు. అయితే, మార్చి 9న విద్యార్థులంద‌రికీ మ‌రొక‌మారు క‌రోనా ర్యాపిడ్ ప‌రీక్ష నిర్వహించగా ఎలాంటి వ్యాధి ల‌క్షణాలు లేక‌పోయినా 57 మంది విద్యార్థుల‌కు పాటిజివ్ రిపోర్టు వ‌చ్చింది.

అధికారులు వెంట‌నే స్పందించి మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుప‌తిలోని స్విమ్స్ దవాఖానకు త‌ర‌లించారు.మ‌ళ్లీ వారికి ఆర్‌టిపిసిఆర్ ప‌రీక్ష చేయించారు. ఫ‌లితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. వారు ప‌రిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. త్వరలోనే వారిని డిశ్చార్జి చేయనున్నారు. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ నేప‌థ్యంలో మిగిలిన 378 మంది విద్యార్థుల‌కు, 35 మంది అధ్యాప‌కుల‌కు, 10 మంది ఇత‌ర సిబ్బందికి క‌రోనా పరీక్షలు నిర్వహించగా అంద‌రికీ నెగెటివ్ వ‌చ్చింది.

Read More:

నిరుపేదలకు అండగా గుడ్‌నైబర్స్‌ ఆర్గనైజేషన్‌.. హరిజనవాడలో నిత్యావసర సరుకుల పంపిణీ

అట్టుడుకుతున్న ఉక్కునగరం.. గుంటూరు నుంచి విశాఖకు పాదయాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ

ఆ విషయంలో కేంద్ర నిర్ణయం సబబే.. జగన్‌, చంద్రబాబుకు అన్నీ తెలుసు.. రాజకీయ లబ్దికోసమే రాద్దాతమంటున్న బీజేపీ

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..