ఎన్నికల తొలిదశ, కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ల జాబితాలో ‘జీ-23’ నేతలకు దక్కని చోటు
దేశంలో 4 నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ కాంపెయినర్ల జాబితాలో 'జీ-23' నేతలకు చోటు దక్కలేదు.
దేశంలో 4 నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన స్టార్ కాంపెయినర్ల జాబితాలో ‘జీ-23’ నేతలకు చోటు దక్కలేదు. మొత్తం 30 మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టును పార్టీ విడుదల చేసింది. ఇందులో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్, పంజాబ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, అమరేందర్ సింగ్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, ఇంకా బెంగాల్ పార్టీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి, భూపేష్ బాఘేల్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, సచిన్ పైలట్, నవ జోత్ సింగ్ సిద్దుతో బాటు జితేన్ ప్రసాద్, అఖిలేష్ ప్రసాద్ సింగ్ తదితరులున్నారు.
పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గత ఆగస్టులో బహిరంగంగా లేఖ రాసి సంచలనం సృష్టించిన 23 మంది నేతల్లో ఇద్దరు తప్ప మరెవరికీ ఈ లిస్టులో చోటు లభించలేదు. వారే జితేన్ ప్రసాద్, అఖిలేష్ ప్రసాద్ సింగ్.. వీరిలో అఖిలేష్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక ఈ లేఖ రాసిన వారిలో సీనియర్ నేతలైన గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్ వంటివారిని పార్టీ పక్కన బెట్టింది.అయితే పార్టీ కోరిన పక్షంలో తాను ఎన్నికల ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నానని, వెంటనే ఇందుకు ఆయా రాష్ట్రాలకు వెళ్తానని గులాం నబీ ఆజాద్ ఇదివరకే ప్రకటించారు. కాగా మొదటి దశ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో వీరి పేర్లు లేకపోయినప్పటికీ.. ఇతర దశల్లో జరిగే ఎన్నికల్లో ప్రచారానికి పార్టీ వీరిని ఉపయోగించుకోవచ్చునని సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఉదాహరణకు బెంగాల్ ఎన్నికలు 8 దశల్లో జరగనున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి:
వేద పాఠశాలను తనిఖీ చేసిన వైవీ సుబ్బారెడ్డి.. మూడు రోజుల క్రితం 57 మంది విద్యార్థులకు సోకిన కరోనా