AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అట్టుడుకుతున్న ఉక్కునగరం.. గుంటూరు నుంచి విశాఖకు పాదయాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటికరణ చేయడాన్ని నిరసిస్తూ..... గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ పాదయాత్ర చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం 32 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన..

అట్టుడుకుతున్న ఉక్కునగరం.. గుంటూరు నుంచి విశాఖకు పాదయాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ
Visakha Ukku Padayathra
K Sammaiah
|

Updated on: Mar 13, 2021 | 11:21 AM

Share

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటికరణ చేయడాన్ని నిరసిస్తూ….. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ పాదయాత్ర చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం 32 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమృతరావు విగ్రహం వద్ద నుండి విశాఖ ఉక్కు కర్మాగారం వరకు పాదయాత్ర చేపట్టారు. విశాఖ వరకు చేపట్టిన పాదయాత్ర ను మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ జెండా ఊపి ప్రారంభించారు.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కు అని దానిని కాపాడుకోవడానికి యువత రాష్ట్ర ప్రజలు అందరూ ముందుకు రావాలని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ అన్నారు. ఊరూవాడా ఏక‌మై కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున నిరసన తెలపాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రాణాలు సైతం లెక్కచేయబోమని ఈసందర్భంగా తెలిపారు.

ఉప్పుపై బ్రిటీష్ వారు విధించిన పన్నును ధిక్క‌రిస్తూ మ‌హాత్మా‌గాంధీ 1930 మార్చి 12వ తేదీన ఉప్పు స‌త్యాగ్ర‌హం చేశారు. అయన స్పూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ…గుంటూరు నుంచి విశాఖ ఉక్కు పరిశ్రమ వ‌ర‌కు 400 కిలోమీట‌ర్ల మేర పాదయాత్ర చేపట్టినట్లు సామజిక కార్యకర్త సురేష్ తెలిపారు.

ప్రైవేటీక‌ర‌ణ‌తో అంద‌రికీ న‌ష్టమేనని.. ప్ర‌భుత్వ రంగ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న ప‌రిశ్ర‌మ‌లు ప్రైవేటీక‌ర‌ణ జ‌రిగితే ప్ర‌ధానంగా కార్మికులు రోడ్డున ప‌డ‌ట‌మే కాకుండా రాబోయే త‌రాల‌కు కూడా ఉద్యోగాలు లేకుండా పోతాయన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు పాద‌యాత్ర చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అన్ని రాజకీయ , ప్రజా సంఘాల నేతలు ఈ ఊద్య‌మంలో భాగ‌స్వాములై విశాఖ ఉక్కును కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

ట్రేడ్‌ యూనియన్ల నిరసనలు మరోవైపు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కునగరం అట్టుడుకుతుంది. మల్కాపురం ప్రధాన కూడలిలో శుక్రవారం అఖిలపక్ష ట్రేడ్‌ యూనియన్ల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వైజాగ్‌ స్టీల్‌ పరిరక్షణ కమిటీ విశాఖ జిల్లా జెఏసీ చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు, వైస్‌ చైర్మన్‌ భోగవిల్లి నాగభూషణం మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తే సహించబోమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ మల్కాపురం జోన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.పెంటారావు, పైడిరాజు, ఇంటక్‌ నాయకులు తాతబాబు, సీఐటీయూ నాయకులు సురేశ్‌, బీఎస్‌ మూర్తి, రమణ, బాబూరావు, నరేశ్‌, నవీన్‌, టీ.అప్పారావు, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More:

ఆ విషయంలో కేంద్ర నిర్ణయం సబబే.. జగన్‌, చంద్రబాబుకు అన్నీ తెలుసు.. రాజకీయ లబ్దికోసమే రాద్దాతమంటున్న బీజేపీ

పేరూరుకు నీరొచ్చింది.. రైతుకు నవ్వొచ్చింది.. పరిటాల కుటుంబానికి మాత్రం కన్నీరొచ్చింది -గోరంట్ల మాధవ్