పేరూరుకు నీరొచ్చింది.. రైతుకు నవ్వొచ్చింది.. పరిటాల కుటుంబానికి మాత్రం కన్నీరొచ్చింది -గోరంట్ల మాధవ్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి పరిటాల కుటుంబాన్ని, ఎమ్మెల్యే బాలక్రిష్ణను టార్గెట్ చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని..

పేరూరుకు నీరొచ్చింది.. రైతుకు నవ్వొచ్చింది.. పరిటాల కుటుంబానికి మాత్రం కన్నీరొచ్చింది -గోరంట్ల మాధవ్
Mp Gorantla
Follow us
K Sammaiah

|

Updated on: Mar 13, 2021 | 10:30 AM

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి పరిటాల కుటుంబాన్ని, ఎమ్మెల్యే బాలక్రిష్ణను టార్గెట్ చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరుకు నీరొచ్చింది.. రైతుకు నవ్వొచ్చింది.. పరిటాల కుటుంబానికి మాత్రం కన్నీరు వచ్చిందంటూ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాదయాత్ర ముగింపు సభలో ఎంపీ గోరంట్ల మాధవ్ పాల్గొని ప్రసంగించారు.

అనంతపురం జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ తో అల్లాడిపోయిందన్నారు ఎంపీ మాధవ్‌. ఆ రక్తకాండలో కొందరు చనిపోతే.. మరికొందరు జైళ్లలో మగ్గిపోయారన్నారు. ఆ రోజు చేసిన పాపాన్ని ఈ రోజు తమ ప్రభుత్వం పేరూరుకు నీరు తీసుకొచ్చి కడేగిసిందన్నారు. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని.. చంద్రబాబు ముసలివాడు అయ్యారని.. ఆయన కొడుక్కి నోట మాట రాదని కామెంట్ చేశారు.

ఇక ఎమ్మెల్యే బాలక్రిష్ణ పొద్దుగూకాక.. పుల్ బాటిల్ తాగుతారని తెల్లారక అందర్నీ తంతారని మాధవ్ అన్నారు. గతంలో టీడీపీ అభిమానిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చేయి చేసుకోవడాన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఖండించారు. ఎంపీ మాధవ్‌ మాట్లాడుతూ.. రాత్రి మందు తాగడం.. పగలు ప్రజలను కొట్టడం ఎమ్మెల్యే బాలకృష్ణకు మామూలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటేసిన పాపానికి అభిమానులు శిక్ష అనుభవించేందుకు సిద్దంగా లేరని అందుకే వైసీపీ వైపు చూస్తున్నారని మాధవ్‌ అన్నారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ నిరాశ, నిస్పృహలతో సొంత పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్‌ విమర్శించారు. బాలకృష్ణ దాడి చేసింది కార్యకర్తపై కాదు.. హిందూపురం ప్రజలపై దాడి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. పంచరైన సైకిల్‌ను చంద్రబాబు వయోభారంతో తొక్కుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

బాలకృష్ణ ఎప్పుడు ఎలా ఉంటాడోనని అభిమానులు, నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఆయన పక్కన నిల్చోవాలన్నా వణికిపోతున్నారు. ఇప్పటికే ఆయన చేతిదెబ్బ రుచి చూసిన, బూతులు తిట్టించుకున్న వాళ్లు కోకొల్లలు. తాజాగా ఓ అభిమాన ఫొటోగ్రాఫర్‌ ఉత్సాహంతో ఫొటో తీయడంతో బాలయ్య అతని చెంప ఛెళ్లుమనిపించిన సంగతి విధితమే

అయితే మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. టీడీపీ నాయకులపైనే తన దుడుకుతనాన్ని ప్రదర్శించారు. సుగూరు ఆలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా… ఆయన హావభావాలు చూసిన టీడీపీ నేతలతో పాటు ప్రజలు ఫక్కున నవ్వారు. దీనిపై బాలయ్య సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే.

కాగా, పేరూరు డ్యామ్‌కు ప్రభుత్వం ఒక టీఎంసీ నీటిని  కేటాయించడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే తోపుదుర్తి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. కర్ణాటకలోని నాగలమడక నుంచి పేరూరు వరకు చేపట్టిన 28 కి.మీ పాదయాత్రలో ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్యే తోపుదుర్తితో పాటు భారీ ఎత్తున రైతులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Read More:

ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. ఆలా అయితే చెల్లదన్న ధర్మాసనం

ఎన్నికల ఇంచార్జ్‌లతో మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్‌.. ఆ విషయంలో మంత్రి కీలక సూచనలు

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!