మమతపై దాడి కేసులో మరిన్ని వివరాలు కోరిన ఈసీ, గాయాల తాలూకు రిపోర్టుపై అసంతృప్తి

బెంగాల్ సీఎం మమతా ముఖర్జీపై దాడి కేసులో ఎన్నికల కమిషన్ మరిన్ని వివరాలు కోరింది. ఆమెకు తగిలిన గాయాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందజేసిన నివేదిక సమగ్రంగా లేదని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.

మమతపై దాడి కేసులో మరిన్ని వివరాలు కోరిన ఈసీ, గాయాల తాలూకు రిపోర్టుపై అసంతృప్తి
Mamata Banerjee
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 13, 2021 | 11:53 AM

బెంగాల్ సీఎం మమతా ముఖర్జీపై దాడి కేసులో ఎన్నికల కమిషన్ మరిన్ని వివరాలు కోరింది. ఆమెకు తగిలిన గాయాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందజేసిన నివేదిక సమగ్రంగా లేదని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది.శనివారం సాయంత్రానికల్లా రిపోర్టు పంపాలని సూచించింది. ఇటీవల నందిగ్రామ్ లో తన నామినేషన్ దాఖలు చేసి.. సాయంత్రం తిరిగి కోల్ కతా వెళ్లేందుకు తన కారు ఎక్కబోతుండగా మమత గాయపడ్డారు. ఆమె ఎడమ కాలికి, కుడి భుజం, మోచెయ్యి, మెడపై గాయాలయ్యాయి. నలుగురైదుగురు వ్యక్తులు తనను కారులోకి తోసేసి గాయపరిచారని ఆమె ఆరోపించినట్టు మొదట వార్తలు వచ్చాయి. అయితే కోల్ కతా లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె.. ఈ ఘటనకు ఎవరినీ తప్పు పట్టడంలేదని,  తమ టీఎంసీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని, ప్రజలకు ఇబ్బందులు కల్పించే ఎలాంటి చర్యలకూ పాల్పడరాదని ఓ వీడియో సందేశమిచ్చారు. వీల్ చైర్ పైనే తాను ప్రచారం చేస్తానని ఆమె పేర్కొన్నారు.

హాస్పిటల్ బెడ్ పై నుంచే దీదీ ఈ మెసేజ్ ఇచ్చారు. కాగా నిన్న హాస్పటల్ నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యారు.  ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనువుగా తనను వెంటనే డిశ్చార్జ్ చేయాలని డాక్టర్లను కోరారు. అటు ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. మమతా బెనర్జీ పాల్గొన్న ర్యాలీ, ఆమెకు తగిలిన గాయాలకు సంబంధించిన పబ్లిక్ వీడియోను కూడా  రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అసలు ఇదంతా డ్రామా అని వారు మొదటే ఆరోపించిన విషయం గమనార్హం. ఇక  మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఆరుగురు  ఎంపీల బృందం కూడా ఈసీని కలిసి  ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసీ.. ఆమెకుతగిలిన గాయాల తాలూకు నివేదిక అసమగ్రంగా ఉందని పేర్కొనడం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి:

J&K: ఉగ్రవాద ముఠా గుట్టురట్టు.. ఏడుగురు అరెస్ట్.. భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం

బుల్లితెరపై మరోసారి అలరించనున్న ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోమో రిలీజ్ చేసిన యంగ్ టైగర్..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!